• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోస్ట్‌ వెయిటెడ్‌ హిట్...

మోస్ట్‌ వెయిటెడ్‌ హిట్ మోవీ ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్‌

By - Tupaki Desk
Update: 2022-03-13 06:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగుభాయ్ సినిమా ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొంది దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను సునాయాసంగా దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఈ స్థాయి వసూళ్లను దక్కించుకున్నది లేదు.

ఆలియా భట్‌ ను లేడీ సూపర్ స్టార్ అంటూ ఆమె అభిమానులు కీర్తిస్తున్నారు. కరోనా వల్ల దాదాపు రెండు సంవత్సరాల నుండి గంగూభాయ్‌ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఒక వర్గం ప్రేక్షకులు విమర్శలు చేసిన మెజారిటీ వర్గం వారు మాత్రం సినిమా కు పాజిటివ్‌ కామెంట్ చేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ఆలియా అభిమానులు మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్‌ రైట్స్ ను కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమాను ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెల చివరి వారంలో విడుదలైన ఈ సినిమా ను నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందం జరిగింది.

నాలుగు వారాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో మార్చి 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు ఓటీటీ ద్వారా తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.. కానీ అతి త్వరలోనే మార్చి 25న మరో సారి ఆలియా భట్‌ ను గంగూభాయ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించే అవకాశాలున్నాయి.

మరో వైపు తెలుగులో ఈమె నటించిన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. మార్చి 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అంటే గంగూభాయ్‌ మరియు ఆర్‌ ఆర్ ఆర్ సినిమాలు ఒకే సారి.. ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే థియేటర్ రిలీజ్ అయినా గంగూభాయ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనుక ఆలియాభట్ అభిమానులకు కచ్చితంగా మార్చి 25 తారీఖు స్పెషల్ అనడంలో సందేహం లేదు.
Tags:    
  • Aliabhatt 
  • Ajay Devgan 
  • Gangubai Kathiawadi 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS