నాపై గ్యాంగ్ రేప్‌.. ఆమె వ‌ల్లే ముగ్గురు అఘాయిత్యం చేశారు!

Update: 2021-02-16 05:30 GMT
బాలీవుడ్ న‌టి, మోడల్ గెహనా వశిష్ట్ అలియాస్ వందన తివారీపై సంచలన ఆరోపణలు చేసింది ఓ న‌టి. గెహనా ప్రోద్బ‌లంతో.. ఆమె స్టాఫ్ లోని ముగ్గురు త‌న‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని ఆ ప్రముఖ నటి ఆరోపించారు. ప్ర‌స్తుతం ఈ వార్త సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. పోర్న్ వీడియోలు షూట్ చేస్తున్నారనే అభియోగంతో గెహనా ఇప్ప‌టికే అరెస్టైన విష‌యం తెలిసిందే. తాజాగా గ్యాంగ్ రేప్ కు పురికొల్పింద‌న్న అభియోగంతో ఆమెపై మ‌రో కేసు న‌మోదు చేశారు పోలీసులు.

మోడల్ గెహనా వశిష్ట్.. ‘గంధీ బాత్’ అనే వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ సాధించింది. ఆ తర్వాత 2015 క్రికెట్ వరల్డ్ కప్ కు యాంకర్‌గా కూడా పనిచేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ తో తమిళంలో ‘పీల్ జాకిరథై’ అనే చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించింది. ఆ విధంగా దూసుకుపోతున్న గెహనా పై పోర్న్ వీడియోల అంశం చుట్టుముట్టింది.

పోర్న్ వీడియోలు చిత్రీకరించి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంపై గెహనాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 87 వీడియోలను అప్లోడ్ చేశారని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఆమె పోలీస్ రిమాండ్‌లో ఉంది. అయితే.. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఆమెపై గ్యాంగ్ రేప్ సూత్రధారి ఆరోపణలు వచ్చాయి. గెహనాకు సంబంధించిన ముగ్గురు అసిస్టెంట్లు తనను బంధించి, తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు ప్రముఖ నటి ఆరోపించారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. గెహనాపై మరో కేసు నమోదైంది.

అయితే.. గెహనా వశిష్ట్ న్యాయవాది మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. ఆమె పోర్న్ వీడియోలలో నటించారనేది అబద్ధం అని చెప్పిన లాయ‌ర్‌.. గ్యాంగ్ రేప్ ఆరోపణలు కూడా క‌ల్పితం అన్నారు. గెహనాపై కక్షగ‌ట్టి ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
Tags:    

Similar News