వీడియో : 'ఆకాశం నీ హద్దురా' స్క్రిప్ట్ నుండి స్క్రీన్ వరకు...!

Update: 2020-10-10 18:00 GMT
దక్షిణాది అగ్ర కథానాయకుడు సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'సూరారై పొట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదల కానుంది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ గునీత్ మోంగా మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య కలిసి నిర్మించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో 'ఆకాశం నీ హద్దురా' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబ‌ర్ 30న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా 'స్క్రిప్ట్ నుండి స్క్రీన్ వరకు' అంటూ మారా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో 'ఆకాశం నీ హద్దురా' సినిమా కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేసుకున్నారో.. ఎంత హార్డ్ వర్క్ చేసారో హీరో సూర్య మరియు డైరెక్టర్ సుధా కొంగర తెలిపారు. పదేళ్ల క్రితం 'గురు' స్టోరీ రాస్తున్న సమయంలో కెప్టెన్ గోపీనాథ్ ఇంటర్వ్యూ చూశానని.. గోపీనాథ్ జీవితం మీద వచ్చిన బుక్ చదివి సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నానని.. సూర్యకు ఈ స్టోరీ నచ్చింది.. ఇలాంటి స్టోరీ మనం చెప్పాలని వెంటనే ఓకే చేసాడని.. వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంత సమయం ఎందుకు.. ఇంత బడ్జెట్ ఎందుకు అని రకరకాల డౌట్స్ వ్యక్తం చేస్తారని చెప్పి సూర్య స్వయంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడని డైరెక్టర్ సుధా చెప్పింది. అంతేకాకుండా ఇంతకముందు ఏ సినిమాకూ రీడింగ్ సెషన్ అంటూ ప్రత్యేకంగా చేయని సూర్య.. ఈ సినిమా కోసం మొదటిసారి రీడింగ్ సెషన్స్ చేశారని సుధా కొంగర తెలిపారు.

సూర్య మాట్లాడుతూ 'సుధా 40 పేజెస్ కంటే తక్కువ సినాప్సిస్ తో ఓ స్క్రిప్ట్ ఇచ్చింది. ఇది కచ్చితంగా సూట్ అవుతుందని నేను చెప్పను. ఒకసారి చదివి చూడండి అని చెప్పింది. ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్ జీవితంలో ఎదుర్కొన్న ఒడిడుకులు గురించి చెప్పే స్టోరీ ఇది' అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి - కరుణాస్ - వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Full View
Tags:    

Similar News