ఫోటో స్టొరీ: సిక్స్ ప్యాక్ లుక్ లో మరో హీరో

Update: 2019-01-20 08:39 GMT
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జయపజయాలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.  శ్రీనివాస్ ప్రస్తుతం తేజ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకమునుపే మరో సినిమాను లైన్లో పెట్టాడు.  రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఈమధ్యే ప్రకటించారు. రమేష్ వర్మ గతంలో 'అబ్బాయితో అమ్మాయి'.. 'వీర'.. 'రైడ్' సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకోసం బెల్లంకొండ ఓ కొత్త లుక్ లో కనిపిస్తాడట.  అందుకోసం ఇప్పటికే జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టాడు. సల్మాన్ ఖాన్ లాగా కండలు పెంచడమే కాకుండా సిక్స్ ప్యాక్ అవతారంలో దర్శనమివ్వనున్నాడట.  జిమ్ లో ఎక్సర్ సైజులతో పాటుగా ట్రైనర్ పర్యవేక్షణలో స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. తాజాగా జిమ్ లో చెమటోడుస్తున్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "విజయానికి హార్డ్ వర్క్ ఒకటే దారి! విజయవంతమైన.. అద్భుతమైన 2019 కోసం!" అంటూ ట్వీట్ చేశాడు.
 
చూస్తుంటే బెల్లంకొండ బాబు ఈసారి తన సినిమాకోసం మరింతగా కష్టపడేందుకు రెడీ అయ్యాడు. పనిలో పనిగా నటన కూడా మెరుగుపరుచుకుంటే టాలీవుడ్ కు ఒక టాల్ అండ్ హ్యాండ్సమ్ హీరో దొరికినట్టే.  అన్నట్టు ఈ సినిమాను A స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. 

Full View
Tags:    

Similar News