• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: ‘ఫిక్స్ అయిపో’...

వీడియో: ‘ఫిక్స్ అయిపో’ అంటూ మల్లిక వెంటపడుతున్న బస్తీ బాలరాజ్

By - Tupaki Desk
Update: 2021-03-11 06:00 GMT
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ''చావు కబురు చల్లగా''. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా తాజాగా సినిమాలోని ‘ఫిక్స్ అయిపో’ అనే ఫుల్ వీడియో సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'హే.. ఓర కంటితో అలా చూస్తావే.. బుర్ర వేడెక్కి పోయేలా.. హే.. దూర దూరంగా నన్నే తోస్తావే..' అంటూ సాగిన ఆ పాటకు జేక్స్‌ బిజోయ్ ట్యూన్ అందించాడు. ఈ సాంగ్ కి కౌశిక్ పెగళ్ళపాటి - సనారే కలిసి క్యాచీ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ - ఆదిత్య కలిసి ఆలపించారు. స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు తను ప్రేమించిన మల్లిక వెంటపడుతూ ఈ జన్మ నాతోనే అని ఫిక్స్ అయిపో అంటూ ఈ పాట పాడుతున్నాడు. ఇందులో కార్తికేయ వేసిన స్టెప్స్ అలరిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన 'మై నేమ్ ఈజ్ రాజు' 'కదిలే కాలాన్నడిగా' 'పైన పటారం.. లోన లొటారం' సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వచ్చిన 'ఫిక్స్ అయిపో' పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. 'చావు కబురు చల్లగా' చిత్రంలో ఆమని - మురళీ శర్మ - శ్రీకాంత్‌ అయ్యంగర్ - మహేష్ - భద్రం ఇతర పాత్రలు పోషించారు.


Full View
Tags:    
  • Karthikeya 
  • New movie 
  • Chavu Kaburu Challaga 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS