డిజిటల్ ప్లాట్ ఫామ్ విడుదలకు సిద్దమైన ఫస్ట్ తెలుగు సినిమా

Update: 2020-04-24 16:30 GMT
కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూసివేసిన తరువాత తెలుగు నిర్మాతలు ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నారు. ఓటిటి వేదికలు థియేట్రికల్ విడుదలకు ముందే సినిమాలను నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేయడానికి ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే, ఫైనల్ కాల్ కోసం మే 7వ తేదీన లాక్ డౌన్ పూర్తయ్యే వరకు వరకు ఆగితే బెటర్ అని చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న విడుదల కావాల్సిన చిన్న సినిమా 'అమృతరామమ్' కరోనా వలన నిలిపివేయబడింది. దర్శక నిర్మాతలు ఇటీవలే ఈ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించారు.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 29 నుండి జీ5 లో ప్రసారం కానుంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్  విడుదల ఆగిపోవడంతో ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇంకా అనేక చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల కానున్నాయి. ప్రస్తుతం వాటి విడుదలకు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక మెగా నిర్మాత అల్లు అరవింద్ కొన్ని సినిమాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, త్వరలో వాటిని ప్రకటించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రేక్షకులు త్వరలో చాలా సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూడబోతున్నారు.
Tags:    

Similar News