ఎట్టకేలకు ఒక ఇంటర్యూ ఇచ్చాడండీ

Update: 2017-04-26 09:34 GMT
సడన్ గా రాజమౌళి దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. ప్రింట్ అండ్ వెబ్ మీడియావారు షార్టు నోటీస్ ఇచ్చాం అని ఏమీ అనుకోకుండా మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్యూకు రమ్మంటూ మెసేజ్ పంపేశారు. అయితే ఈ ఇంటర్యూ పెట్టడానికి ముందు జరిగిన కథాకమామిషూ చాలా ఉంది. ఈరోజు ఉదయమే దుబాయ్ నుండి వచ్చిన రాజమౌళి.. వెంటనే తెలుగు మీడియాకు ఇలా ఇంటర్యూలు  ఎందుకు ఇచ్చాడంటే...

నిజానికి ఇప్పటివరకు ఎక్కువగా నేషనల్ మీడియాకు రాజమౌళి అండ్ టీమ్ ఇంటర్యూలు ఇచ్చారు. ఓ రెండు మూడు తెలుగు ఛానళ్ళకు వీడియో ఇంటర్యూ ఓ రెండు వారాల క్రితమే రికార్డు చేయించారు. అయితే ప్రింట్ అండ్ వెబ్ మీడియాలకు మాత్రం ఎటువంటి ఇంటర్యూలు ఇవ్వలేదు. కేవలం సినిమాకు ఫైనాన్సింగ్ చేసిన ఒక మీడియా వారి పేపర్లో మాత్రం.. దాదాపు వారం నుండి రోజుకో బాహుబలి సెలబ్రిటీ ఇంటర్యూ వచ్చేలా ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తూ కామ్ గా ఉన్న తెలుగు మీడియా సడన్ గా నిన్న రాజమౌళిని క్రిటిసైజ్ చేశారు. దానితో వెంటనే ఆప్రమత్తమైన దర్శకదీరుడు ఈరోజు ఇలా అందరికీ ఇంటర్యూలు పెట్టేశాడు.

ఒకేసారి కలిపి అన్ని మీడియాలకూ సింగిల్ ఇంటర్యూ ఇచ్చేస్తే.. బాహుబలి ప్రత్యేక ఇంటర్యూ ఇవ్వలేదని కొరత తీరిపోతుందనేది రాజమౌళి థింకింగ్ కాబోలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News