ఫైటర్‌' ఆలస్యంకు అసలు కారణం ఇదేనా?

Update: 2020-12-05 07:18 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌ గా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్‌' మూవీ మార్చి లో కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. 30 శాతంకు పైగా చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించక పోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు అంతా కూడా షూటింగ్‌ లను ప్రారంభించారు. కాని ఇప్పటి వరకు విజయ్‌ మాత్రం తన ఫైటర్‌ సినిమాను మొదలు పెట్టక పోవడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ హీరోలు సైతం కరోనా భయం లేకుండా షూటింగ్‌ లో జాయిన్‌ అయితే విజయ్ దేవరకొండ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనే ప్రశ్న అందరిలో వ్యక్తం అవుతుంది. డిసెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది అనుకుంటే ఈ నెలలో కూడా షూటింగ్‌ లేదని తేలిపోయింది. జనవరి రెండవ వారంలో ఫైటర్‌ ను పునః ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఫైటర్‌ సినిమా కోసం విదేశీ ఫైటర్స్‌ కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వారు వచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణం పునః ప్రారంభం ఆలస్యం అవుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొన్ని సీన్స్‌ హిందీ ప్రేక్షకుల కోసం విభిన్నంగా రూపొందించనున్నారట. ఈ సినిమా నిర్మాణంలో కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కడ ఇక్కడ కూడా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
Tags:    

Similar News