జక్కన్న సినిమాలో పీటర్ లేడా? రాడా?

Update: 2016-03-11 04:05 GMT
తనకంటూ ఆస్థాన టెక్నీషియన్లను పెట్టుకుని వారిని ఎట్టిపరిస్థితులలో దూరం చేసుకోకుండా హై క్వాలిటీ సినిమాలు తీసే నేర్పు రాజమౌళిది. కీరవాణి - సెంధిల్ కుమార్ - రామా రాజమౌళి - పీటర్ హెయిన్స్ ఇలా అత్యుత్తమ టెక్నీషియన్లతో సినిమాలు కొనసాగిస్తున్న రాజమౌళి ప్రస్తుతం బాహుబలి - ది కంక్లుజన్ ని తెరకెక్కించే క్రమంలో వున్నాడు.

పస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పీటర్ హెయిన్స్ కాకుండా మరో యాక్షన్ డైరెక్టర్ కెచా నేతృత్వంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కెచా ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ తో అందరినీ మెప్పించాడు. అయితే సడెన్ గా బాహుబలి సిరీస్ లో ఇతని పేరు ఎందుకు వినిపించిందో అర్ధంకాలేదు.

బాహుబలి మొదటిభాగంలో యాక్షన్ ఎపిసోడ్ లకు అంతటి ఆదరణ లభించకపోవడంతో  పీటర్ హెయిన్స్ ని  జక్కన్న పక్కన బెట్టాడా? లేక పీటర్ కి డేట్స్ అడ్జస్ట్ కాక షూటింగ్ ని ఆపలేక ఈ ఒక్క సీక్వెన్స్ నే కెచాకి అప్పగించాడా అన్న విషయంపై ఇంకా స్పష్టతరాలేదు.
Tags:    

Similar News