'ఆచార్య'పై వస్తున్న పుకార్లపై చరణ్ క్లారిటీ ఇవ్వనున్నాడా...?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ - కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. దీంతో తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అతృతతో వెయిట్ చేస్తున్న మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు వారికి షాక్ తెప్పించే మరో న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా నుండి హీరోయిన్ కాజల్ తప్పుకుందట. వాస్తవానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి హీరోయిన్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె అనూహ్యంగా తప్పుకొని షాకిచ్చింది. అయితే సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. తన పాత్రకి తగ్గ ప్రాధాన్యతను తగ్గించారని అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ విషయాలపైన చిరంజీవి స్పందిస్తూ 'త్రిషకి చిత్ర యూనిట్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని' స్పష్టం చేశారు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి రావడం తో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా చిరంజీవి వెల్లడించారు.
ఈ క్రమంలో మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతూ ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ తో భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ కాజల్ ని తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తీరా సెట్స్ మీదకొచ్చే సమయానికి త్రిష లాగే కాజల్ కూడా హాండిచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'ఆచార్య' సినిమా తర్వాత ఓ భారీ తమిళ సినిమా చేసేందుకు కాజల్ అంగీకరించిందట. ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయడం.. అడ్వాన్స్ తీసుకోవడం కూడా జరిగిపోయిందట. కానీ 'ఆచార్య'కు మార్చి నెలలో కాజల్ కేటాయించిన డేట్లు కరోనా లాక్‌డౌన్ కారణంగా వృథా అయిపోవడంతో.. జులై నుంచి తమిళ సినిమా షూటింగ్ లో కాజల్ పాల్గొనాలి. కాబట్టి ఆమెకు వేరే ఆప్షన్ లేక 'ఆచార్య' నుంచి కాజల్ తప్పుకున్నట్టేనని వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆచార్య సినిమాపై వస్తున్న పుకార్లతో కలవరపడిపోతున్నారు. 'ఆచార్య' సినిమాకి నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ దీనిపై స్పందించి అధికారిక ప్రకటన ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిణామాలను బట్టి సినిమా విడుదలపై క్లారిటీ రానుంది.