సైరా: ఫేక్ కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో రచ్చ

Update: 2019-10-11 07:19 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ తో పాటుగా మంచి రివ్యూస్ కూడా రావడంతో ఫ్యాన్స్ అందరూ బ్లాక్ బస్టర్ ఖాయమని అనుకున్నారు. కానీ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తే మాత్రం అదేమంత సులువుగా జరిగేలా కనిపించడం లేదు. తెలుగు తప్ప మిగతా అన్నీ వెర్షన్లు డిజాస్టర్లు అయ్యాయి.  తెలుగులో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుకు దూరంగానే ఉంది.

'సైరా' టీమ్ తమ సినిమా కలెక్షన్స్ ప్రకటించబోవడంలేదని ముందు చెప్పినట్టుగానే మాటమీద నిలబడ్డారు. ఇప్పటివరకూ అధికారికంగా 'సైరా' టీమ్ కలెక్షన్స్ ప్రకటించలేదు. అయితే ఒక సెక్షన్ మీడియాలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ ను ఎక్కువ చేసి చెప్తున్నారని.. దీంతో సినిమాను బ్లాక్ బస్టర్ అనిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని యాంటి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.  ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ జెన్యూన్ కలెక్షన్స్ అని మెగాస్టార్ స్టామినా మరోసారి చూపించారని మురిసిపోతున్నారు.  గతంలో కొందరు స్టార్ హీరోల సినిమాలకు అసలు కలెక్షన్లకు ఓ ఇరవై ముప్పై శాతం ఒక్కోసారి యాభై శాతం అదనంగా కలిపి ఫేక్ కలెక్షన్లతో పబ్లిసిటీ చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ విషయంపై ఫ్యాన్స్.. యాంటి ఫ్యాన్స్ మధ్య హంగామా కూడా జరిగింది. ఇప్పుడు 'సైరా విషయంలో అదే జరిగిందనేది యాంటి ఫ్యాన్స్ ఆరోపణ.

ఈ విషయంలో #SyeRaaFakeCollections అంటూ ఒక హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ టాగ్ కింద కొన్ని పోస్టులలో కొన్ని బుక్ మై షో ఎడ్వాన్స్ బుకింగుల ఇమేజిలను పోస్ట్ చేస్తున్నారు. ఇక కొందరైతే.. 'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చినప్పుడు ఫిగర్స్ చూపించి ఇప్పుడు అవి ఎందుకు తగ్గిపోయాయి అని ప్రశ్నిస్తున్నారు.  సైరా అమెరికాలో భారీ రేట్ కు అమ్ముడు పోయిందని బ్రేక్ ఈవెన్ టార్గెట్  $4 మిలియన్లని అన్నారు.. ఇప్పుడేమో 3 మిలియన్లే టార్గెట్ అంటున్నారని.. కొన్ని రోజులు ఆగితే $2 మిలియన్లకు తగ్గించి 'ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది' అంటారా? అని లాజిక్కులు చెప్తున్నారు.  

కొందరేమో గ్రాస్ కలెక్షన్లను షేర్ గా చూపిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ ఏమీ తక్కువ తినడంలేదు.. ఇలాంటి వాటికి దీటుగా సమాధానం ఇస్తూ మెగాస్టార్ కు ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవలసిన అవసరం లేదని...  అందుకే అసలు కలెక్షన్స్ ప్రకటించడం లేదని వెనకేసుకొస్తున్నారు.  ఏదేమైనా 'సైరా' ఫేక్ కలెక్షన్స్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైన చెప్పుకున్న హ్యాష్ టాగ్ తో పాటుగా  #syeraafakeraa #syeraadisaster కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం.


Tags:    

Similar News