'కాంచ‌న' ఫేం ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత‌

Update: 2023-02-19 14:28 GMT
రాఘ‌వ లారెన్స్ 'కాంచ‌న' ఫేం ప్రముఖ హాస్యనటుడు నటుడు మయిల్ సామి గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అత‌డి వ‌య‌సు 57 సంవత్సరాలు. మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో అనేక తమిళ చిత్రాలలో హాస్య పాత్రలలో నటించారు.

ఆయన ఆకస్మిక మరణంతో యావత్ సినీ పరిశ్రమ షాక్ లో ఉంది. ఉదయం నుండి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రముఖ చలనచిత్ర నిర్మాత-నటుడు కె. భాగ్యరాజ్ 'ధావనీ కనవుగల్'తో జనంలో నటుడిగా మైయిల్ సామి తన నటనా రంగ ప్రవేశం చేసాడు. అయితే అనంత‌రం ఫైనెస్ట్ పెర్ఫామ‌ర్ గా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు.

ధూల్-వసీగరా-ఘిల్లి-గిరి- ఉత్తమపుతిరన్- వీరమ్- కాంచన- కంగలాల్ కైధు సెయి వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో న‌టించి మెప్పించారు. అతను ఉత్తమ హాస్యనటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.

అతను ప్రశంసలు పొందిన స్టేజ్ పెర్ఫార్మర్. స్టాండ్-అప్ కమెడియన్..టీవీ హోస్ట్.. థియేటర్ ఆర్టిస్ట్. అతను చెన్నైలోని సన్ టీవీలో అసతపోవతు యారు అనే కార్యక్రమంలో రెగ్యులర్ గెస్ట్ జడ్జిగా కూడా ఉన్నాడు.

అతను ఇటీవల నెంజుకు నీది- వీట్ల విశేషమ్ - ది లెజెండ్ వంటి చిత్రాలలో కనిపించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News