తల్లి అయిన తర్వాత తొలిసారి కెమెరా ముందుకి వచ్చిన స్టార్ హీరోయిన్..!
కియారా అద్వానీ.. వ్యక్తిగతంగా..వృత్తిపరంగా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది అని చెప్పదంలో సందేహం లేదు.;
కియారా అద్వానీ.. వ్యక్తిగతంగా..వృత్తిపరంగా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది అని చెప్పదంలో సందేహం లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే.. ఈ హీరోయిన్ తన కూతురు సారాయాహ్ మల్హోత్రా పుట్టిన తర్వాత.. తొలిసారిగా.. కెమెరా ముందుకు వచ్చింది. అమ్మ అయినా తర్వాత ఆమె చేసిన ఈ తొలి ఫోటోషూట్.. వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు సంబంధించినది కావడం విశేషం. జనవరి ఎడిషన్ కవర్ స్టార్గా కియారా కనిపించడం ఆమె అభిమానుల్లో సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది.
వోగ్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో.. కియారా ఫోటో షేర్ చేస్తూ.. “ఇది కేవలం ఒక ఫ్యాషన్ షూట్ మాత్రమే కాదు. కియారా జీవితంలో వచ్చిన మార్పులు, ఆమె ఆలోచనల్లో వచ్చిన లోతు ఈ షూట్‌లో స్పష్టంగా కనిపిస్తాయి,” అని రాసుకొచ్చారు.
ఈ కవర్ షూట్‌లో కియారా అనామిక ఖన్నా డిజైన్ చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ జాకెట్, స్కర్ట్, కార్సెట్ ధరించింది. అదే సమయంలో మృదువైన ఫ్యాబ్రిక్.. అందమైన ఎంబ్రాయిడరీ ఆమె రూపానికి అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫోటోల్లో కియారా.. యూరోపియన్ రాజకుమారిలా కనిపిస్తూ అభిమానుల్ని అలరించింది. అమ్రపాలి జువెల్స్‌కు చెందిన ఇయర్ రింగ్స్ ఈ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఈ షూట్ వెనుక బలమైన క్రియేటివ్ టీమ్ ఉంది. ఎడిటోరియల్ కంటెంట్‌ను రోషెల్ పింటో పర్యవేక్షించారు. ఫోటోగ్రాఫర్‌గా యుంగ్ హువా చెన్ పని చేశారు. స్టైలింగ్‌ను సమర్ రాజ్‌పుత్ చేశారు. హెయిర్ స్టైలింగ్ సోనం సోలంకి చేశారు. మేకప్‌ను సంధ్యా శేఖర్, మేనిక్యూర్‌ను మనాలి పంచాల్ చేశారు. ప్రొడక్షన్ బాధ్యతలను ఇమ్రాన్ ఖత్రి ప్రొడక్షన్స్ నిర్వహించింది. ఈ షూట్‌కు టిరా.. బ్యూటీ పార్ట్‌నర్‌గా పనిచేశారు.
వోగ్‌తో మాట్లాడిన కియారా, మాతృత్వం తన జీవితాన్ని ఎలా మార్చిందో వివరించింది. చాలా మంది విశ్రాంతి కోసం పుస్తకాలు చదవడం, నిద్రపోవడం చేస్తారని ఆమె చెప్పింది. కానీ తనకు మాత్రం కూతురు నవ్వడం లేదా నిద్రలో చేసే చిన్న శబ్దాలే నిజమైన ఆనందమని చెప్పింది. ఈ చిన్న క్షణాలే తన ఆలోచనలను మార్చాయని తెలిపింది.
తన శరీరంపై ఉన్న అభిప్రాయం కూడా మారిందని కియారా చెప్పింది. గతంలో సినిమాల కోసం కఠినమైన ట్రైనింగ్ చేసి ఒక నిర్దిష్ట ఆకారంలోకి రావాలని అనుకునేదాన్నని... కానీ తల్లి అయిన తర్వాత జీవాన్ని సృష్టించడం ఎంత గొప్పదో అర్థమైందని తెలిపింది. ఇప్పుడు తన శరీరాన్ని ఎలా కనిపిస్తుందో కాకుండా.. అది చేసిన గొప్ప పనికి గౌరవిస్తానని కియారా స్పష్టంగా చెప్పింది.