60 ఏజ్‌లో ఆ బాడీ బిల్డింగ్ ఏంటి మచ్చా?
పిక్కలపైకి లంగోటా తొడిగాడు.. వేళ్లు తన్నిన వటవృక్షపు థైస్.. ఇనుములా రాటు దేలిన కండల్ని చూపిస్తున్నాడు.;
పిక్కలపైకి లంగోటా తొడిగాడు.. వేళ్లు తన్నిన వటవృక్షపు థైస్.. ఇనుములా రాటు దేలిన కండల్ని చూపిస్తున్నాడు. 60ప్లస్ వయసులో మతులు చెడగొడుతున్నాడు. `ఏజ్ లెస్` అన్న పదానికి నిర్వచనంలా కనిపిస్తున్నాడు. అతడు ఎవరో కానీ, మగువల గుండెల్లో మారాజులా వెలిగిపోతున్నాడు.. ఇంతకీ అతడు ఎవరో చెప్పగలరా?
నిస్సందేహంగా ది గ్రేట్ సల్మాన్ భాయ్ గురించే ఇదంతా. పరిశ్రమలో అందరివాడు.. మనసుల్ని గెలుచుకున్నవాడు... మగువల గుండెల్లో మారాజు...60 ప్లస్ బ్యాచిలర్ అతడు. ఇప్పటికీ `సుల్తాన్`లా భళ్లూక పట్టు పట్టడానికి ప్రిపరేషన్ లో ఉన్నాడు. 2025 డిసెంబర్ 27 నాటికి 60 ఏళ్లు నిండనున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ ఇలాంటి ప్రిపరేషన్ తో అంతకంతకు వేడి పెంచేస్తున్నాడు. ఫిట్నెస్ విషయంలో.. వయసు ఒక నంబర్ మాత్రమే.. మనసుండాలే కానీ! అని నిరూపిస్తున్నాడు.
సెలబ్రేషన్ డే కు చాలా ముందే తన పిక్క బలాన్ని ప్రదర్శిస్తూ ఇలా ఫోటోలు వదిలి హాట్ టాపిగ్గా మారాడు. ఉలివేసి చెక్కిన శరీరాన్ని ప్రదర్శిస్తూ, వయస్సు తనను వెంటాడదని సందేహం ఇస్తున్న సల్మాన్ భాయ్ తాజా పోస్ట్ కి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నేను 60 ఏళ్ల వయసులో ఇలా కనిపించాలని కోరుకుంటున్నాను! 6 రోజుల తర్వాత..! అని క్యాప్షన్ ఇచ్చారు. సోమవారం నాడు అతడు దీనిని పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిపోయింది. జిమ్ నుంచి అతడు షేర్ చేసిన ఫోటో గుబులు పుట్టిస్తోంది.
``వృద్ధాప్యం కాదు.. ఇప్పుడే అప్‌గ్రేడ్ అవుతున్నాను.. 35 ఏళ్ల వయసులోనే నాకు వెన్నునొప్పి వచ్చేసిందని ఒక అభిమాని ఆవేదన చెందాడు. మంచి వైన్ లాగా వృద్ధాప్యం నవనవలాడుతోంది... కానీ బెంచ్-ప్రెస్ చేయగల బైసెప్స్‌తో గుబులు పుట్టిస్తున్నాడు! అంటూ సల్మాన్ ని పొగిడేశాడు మరో అభిమాని. భాయ్ కి వయసు ఒక నంబర్ మాత్రమే.. 59 ఏళ్ళ వయసులో ఈ శరీరాకృతి… గల్వాన్ లోయ యుద్ధంలోంచి... టీజర్ లాంచ్‌తో 60 ఏళ్లు ఊహించుకోండి! బ్లాస్ట్ అవుతుంది అని అభిమానులు ప్రశంసించారు.
చైనా- ఇండియా బార్డర్ లోని గల్వాన్ లోయ ఉద్రిక్తతల నేపథ్యంలో అల్లుకున్న కథలో సల్మాన్ భాయ్ విరోచితంగా పోరాడై సైనికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సల్మాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 27న ఈ చిత్రం మొదటి టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం టీమ్ కొంతకాలంగా టీజర్‌పై పని చేస్తోంది. గల్వాన్ యుద్ధ ప్రపంచాన్ని పరిచయం చేసే సినిమా ఇది ... టీజర్ కిక్కిస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ కు ముందే సినిమా నుండి ఒకటి లేదా రెండు పోస్టర్లు విడుదల కావచ్చని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా దీనికి అధికారిక నిర్ధారణ లేదు. అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది. జైన్ షా, హీరా సోహల్, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా.. విపిన్ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. టీజర్ విడుదల సందర్భంగా సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో కూడా వెల్లడిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతానికి తుఫాన్ ముందు నిశ్శబ్ధంలా.. సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్ ఫోటోలు సడెన్ గా వెబ్ లోకి వచ్చి గుబులు పుట్టిస్తున్నాయి. భాయ్ తన ఫ్యాన్స్ కి సరైన బర్త్ డే కానుక అందిస్తాడని ఊహిస్తున్నారు. ఏం చేస్తాడో వేచి చూడాలి.