'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' ప్రోమో: మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న బన్నీ..!
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. ఎర్ర చందనం అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా నాలుగో పాట ప్రోమోను రిలీజ్ చేశారు.
'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..' అంటూ సాగిన ఈ మాస్ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటుంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా నటిస్తున్న అల్లు అర్జున్ లారీ మీద కూర్చొని కనిపించారు. ఊర మాస్ గెటప్ లో బన్నీ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కు గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ ను నకాశ్ అజీజ్ ఆలపించారు.
'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..' సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను నవంబర్ 19న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు 'పుష్ప' టీమ్ వెల్లడించింది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సాంగ్ అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన ఈ పాట ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
'పుష్ప' చిత్రాన్ని ముత్యంశెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Full View