తారక్ - త్రివిక్రమ్ మధ్య అంతా ఓకే నా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మరో సినిమా చెయ్యడానికి వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తరువాయి '#NTR30' అఫీసియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ(చినబాబు) - కళ్యాణ్ రామ్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పూర్తైన వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. అయితే సడన్ గా తారక్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయినట్లు ప్రకటన ఇచ్చారు.
అంతేకాదు వెంటనే కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని తారక్ పక్కన పెట్టడానికి గల కారణాలేంటనేది తెలియరాలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారేమో అనే టాక్ వచ్చింది. ఐతే అవన్నీ అవాస్తవమని రూమర్స్ వీరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరు ఇప్పటికే సన్నిహితంగా ఉంటున్నారని పేర్కొన్నారు. NTR 30 కోసం అనుకున్న స్క్రిప్ట్ వర్కవుట్ అవలేదని.. క్రియేటివ్ డిఫరెన్సెస్ తోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అంటున్నారు. వర్క్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ తప్ప తారక్ - త్రివిక్రమ్ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరూ ఇప్పటికీ మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం వీరి కమిట్మెంట్స్ పూర్తయ్యాక, రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్ లో మరో సినిమా చేస్తారేమో చూడాలి.