పుట్టిన రోజున ‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన!

Update: 2020-07-21 06:15 GMT
ఉపాస నిన్న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా ఆమె పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో నెహ్రూ జు పార్క్‌ లో ఉన్న ‘రాణి’ అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. సంవత్సరం పాటు రాణి పోషణకు కావాల్సిన సౌకర్యాలను తాను అందిస్తానంటూ పేర్కొంది. జూ పార్క్‌ ను సందర్శించిన ఉపాసన రాణిని దత్తత తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా జూ అధికారులకు తెలియజేశారు. కరోనా కారణంగా జూ నిర్వహణ కష్టం అవుతున్న నేపథ్యంలో జంతువులను దత్తత తీసుకునేందుకు స్వచ్చంద సంస్థలు మరియు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

అపోలో ఫౌండేషన్‌ తరపున ‘రాణి’ కి కావాల్సిన దానా మరియు ఇతర అవసరాలను తీర్చబోతున్నట్లుగా ఉపాసన ప్రకటించారు. ఈ సందర్బంగా అయిదు లక్షల రూపాయల చెక్‌ ను కూడా ఉపాసన జూ అధికారులకు ఇచ్చారు. ఈ సందర్బంగా జూ అధికారి క్షితిజ మాట్లాడుతూ.. ఉపాసన గారు మంచి మనసుతో రాణిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ విపత్కర కాలంలో చాలా మంది జంతువుల పట్ల ప్రేమను ప్రదర్శించేందుకు వారు దత్తత తీసుకోవడం అభినందనీయం అంటూ ఆమె అన్నారు. రాణి ని దత్తత తీసుకున్నందుకు గాను ఉపాసనకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags:    

Similar News