యువ సంచలనాలు సీనియర్ నే మించిపోయారే!
ఇండియన్ మ్యూజిక్ సెన్షేషన్ అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ఏ.ఆర్ రెహమాన్. భారతీయ సినిమాలకు ఆయన అందించిన సంగీతం అలాంటింది.;
ఇండియన్ మ్యూజిక్ సెన్షేషన్ అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ఏ.ఆర్ రెహమాన్. భారతీయ సినిమాలకు ఆయన అందించిన సంగీతం అలాంటింది. సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న ఒకే ఒక్క సంగీత దర్శకుడిగా రెహమాన్ కు పేరుంది. ఆయన ఏ భాషలో పని చేసినా? భాషతో సంబంధం లేకుండా ఛార్జ్ చేస్తారు. రెహమాన్ తో ఒక్క సినిమాకైనా పని చేయాలని ప్రతీ దర్శకుడు ఓ కలగా భావిస్తారు. ఆ కల నెరవేరలన్నా ఎంతో అదృష్టం ఉండాలి. కానీ కొంత కాలంగా రెహమాన్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అన్నది అంతే వాస్తవం. మ్యూజికల్ గా మేజిక్ చేయలేకపోతున్నాడని ఆయన వైఫల్యాలే చెబుతున్నాయి.
లెజెండ్ లా సంగీతం అందించిన రెహమాన్ ఇలాంటి పాటలిస్తున్నాడు? ఏంటి అన్నది అన్ని భాషల్లో నిరంతరం చర్చగా మారుతోంది. తాజాగా యువ సంగీత దర్శకుల సక్సస్ తీరు చూస్తే? రెహమాన్ బాగా వెనుకబడుతున్నారని అర్దమవుతుంది. పారితోషికం అందుకోవడంలో ప్రముఖంగా ఇద్దరు దర్శకులు ఏకంగా రెహమాన్ నే మించిపోతు న్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, కన్నడ సంచలనం రవిబస్రూర్ ఇప్పుడు రెహమాన్ ని మించి ఛార్జ్ చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. కొంత కాలంగా వీరిద్దరు మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే.
అనిరుద్ మ్యూజికల్ గా సినిమాను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవసరమైతే తన బీజీఎమ్ తోనే సినిమాను ఆడించే సమర్ధుడిగా హైలైట్ అవుతున్నాడు. దేవర, కింగ్ డమ్ లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి? అంటే కారణం అతడి బీజీఎమ్ తోనే అన్నది తెలిసిందే. ప్రస్తుతం అనిరుద్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి 12 సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. `జన నాయగన్`, `లవ్ ఇన్సురెన్స్ కంపెనీ`, `ది ప్యారడైజ్` చిత్రాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. `డీసీ`, `జైలర్ 2`, ` కింగ్` సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తాయి.
అలాగే తలైవార్ 173వ సినిమాకు, అల్లు అర్జున్ 23 వ సినిమాకు తానే సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. `కేజీఎఫ్` తో సంచలనమైన రవిబస్రూర్ అంతే బిజీగా ఉన్నాడు. `సలార్` తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం `టాక్సిక్` ,` డ్రాగన్` లాంటి పాన్ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. వీటితో పాటు మలయాళం, తమిళ చిత్రాలతోనూ బిజీగా ఉన్నాడు. రెహమాన్ బిజీ షెడ్యూల్ చూస్తే? లైనప్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. దాదాపు 20 సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. భారత్ సహా విదేశీ భాషలతో కలిపి చూస్తే. తెలుగులో `పెద్ది` కి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో `రామయాణం`తో పాటు చాలా సినిమాలకు పని చేస్తున్నారు.