టాలెంటెడ్ హీరోకి వరుస షాక్స్? మార్కెట్ తగ్గిపోయిందా?

టాలీవుడ్‌ లో కామెడీ ఎంటర్టైనర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ టాలెంటెడ్ హీరోకు ఇటీవల వరుసగా రెండు సినిమాల రిజల్ట్స్ షాక్ ఇచ్చినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.;

Update: 2026-03-09 17:30 GMT

టాలీవుడ్‌ లో కామెడీ ఎంటర్టైనర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ టాలెంటెడ్ హీరోకు ఇటీవల వరుసగా రెండు సినిమాల రిజల్ట్స్ షాక్ ఇచ్చినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. సాధారణంగా రొటీన్ కథలతో, ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే కామెడీ సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టే ఆ హీరోకు మంచి మార్కెట్ ఉందని ఇండస్ట్రీలో భావిస్తారు.

అయితే ఇటీవల విడుదలైన రెండు సినిమాల ఫలితాలు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సదరు హీరో కొన్ని రోజుల క్రితం తనకు సెట్ అయ్యే రొటీన్ కామెడీ ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సమయంలో కొంచెం విభిన్నమైన కథతో తెరకెక్కిన ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా కూడా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైంది.

రెండు సినిమాలూ వేర్వేరు కాన్సెప్ట్‌లతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదని ఇండస్ట్రీలో వినికిడి. ముఖ్యంగా ఆ రెండు సినిమాలకు సంబంధించి నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్లలో భారీ కలెక్షన్స్ ఫిగర్లు చూపించినా, ట్రేడ్ సర్కిల్స్ లో మాత్రం ఒరిజినల్ వసూళ్లు అంత మొత్తంలో లేవని ప్రచారం జరుగుతోంది. చాలా తేడా ఉందని టాక్ వినిపిస్తోంది.

మేకర్స్ చూపిస్తున్న నెంబర్స్ తో పోలిస్తే నిజమైన బాక్సాఫీస్ లెక్కలు తక్కువగా ఉన్నాయని సమాచారం. దీనివల్ల ఆ హీరో మార్కెట్ పై కొంత ప్రభావం పడిందని తెలుస్తోంది. సినిమా ఫలితాలు మాత్రమే కాకుండా, వాటి తర్వాత జరిగే బిజినెస్ కూడా హీరోల కెరీర్‌ పై ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. ఇదే పరిస్థితి ఇప్పుడు సదరు హీరో విషయంలో కనిపిస్తోందని టాక్.

ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో మార్పులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇటీవల వరకు ఆ హీరో సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ మంచి ధరలు చెల్లించేందుకు ముందుకు వచ్చేవి. ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ కారణంగా డిజిటల్ మార్కెట్‌ లో డిమాండ్ ఉండేది. అయితే తాజా రెండు సినిమాల తర్వాత కొన్ని ఓటీటీ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది.

ఆ హీరో అప్ కమింగ్ సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో పెద్ద మొత్తాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలా రాబడుతుందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయని సమాచారం. అయితే ఇండస్ట్రీలో చాలా మంది మాత్రం ఇలాంటి పరిస్థితి టెంపరరీ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో పలువురు హీరోలకు ఇలా జరిగినా, సరైన కథతో వచ్చిన ఒక్క హిట్ సినిమాతో వారి మార్కెట్‌ పెరిగిందని, అలాగే ఆ హీరో కూడా మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తే మళ్లీ తన మార్కెట్‌ ను పెంచుకోగలరని అంటున్నారు. మరేం ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News