బాల‌య్య ఎందుకు అంత‌గా ప‌ట్టుప‌డుతున్నాడు?

బోయ‌పాటి శ్రీ‌నుతో చేసిన అఖండ 2` యావ‌రేజ్ అనిపించుకోవ‌డంతో కొత్త సినిమా మొద‌లు పెట్టారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.;

Update: 2026-03-09 22:30 GMT

బోయ‌పాటి శ్రీ‌నుతో చేసిన అఖండ 2` యావ‌రేజ్ అనిపించుకోవ‌డంతో కొత్త సినిమా మొద‌లు పెట్టారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. గోపీచంద్ మ‌లినేనితో ఆయ‌న త‌న 111వ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ముందు పీరియ‌డిక్ స్టోరీ అనుకున్నారు కానీ త‌రువాత దాన్ని ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మాస్ మ‌సాలా యాక్ష‌న్ డ్రామా స్టోరీతో చేస్తున్నారు. వీర సింహారెడ్డి` త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గుట్టుగానే బాల‌య్య‌ని స‌రికొత్త పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్‌గా చూపించ‌బోతున్నాడు గోపీచంద్ మ‌లినేని.

హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి ద‌స‌రాకు భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత మ‌రో ప్రాజెక్ట్‌ని కూడా బాల‌య్య సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది బాల‌య్య న‌టించ‌నున్న 112వ ప్రాజెక్ట్‌. బాల‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే చాలాని మిగ‌తావి అన్ని తాము చూసుకుంటామ‌ని ప్రొడ్యూస‌ర్స్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ బాల‌య్య చుట్టూ తిరిగుతున్నార‌ట‌.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ దీన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ 2027 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని బాల‌య్య ప‌ట్టుబ‌డుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 112వ మూవీని యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌తో చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే వివేక్ ఆత్రేయ ఈ మూవీని రెండు భాగాలుగా అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో చేయాల‌ని భావించ‌డంతో ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు చాలా టైమ్ అవ‌స‌రం అవుతుంది. దీంతో వివేక్ ఆత్రేయ సినిమా సంక్రాంతి బ‌రిలో దిగే అవ‌కాశం లేదు.

వివేక్ ఆత్రేయ‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ కూడా బాల‌య్య‌తో ఓ భారీ యాక్ష‌న్ డ్రామా చేయాల‌ని భావిస్తున్న విష‌యం తెలిసిందే. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ దీన్ని నిర్మించాల‌నుకుంటున్నాడు. దిల్ రాజు కూడా బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవ‌ల క‌లిశాడు కూడా. కానీ అది ఇప్ప‌ట్లో ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రు త‌నతో సినిమా చేయాల‌ని వ‌చ్చినా బాల‌య్య సంక్రాంతికి రిలీజ్ అంటేనే అని రిక్వెస్ట్ చేస్తుండ‌టం ప్రొడ్యూస‌ర్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఏ ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ బాల‌య్య‌కు ఓకే చెప్పినా అది అయ్యే ప‌ని కాదు. దీంతో బాలయ్య 2027 సంక్రాంతి బ‌రిలో దిగాల్సిందేన‌ని అంతగా ప‌ట్టుప‌డుతుండ‌టానికి గ‌త కార‌ణం ఏంటీ?..ఎందుకు సంక్రాంత‌ని టార్గెట్ చేసుకున్నాడు? అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో చాలా సార్లు బాల‌య్య సంక్రాంతి హిట్లు కొట్టారు. ఈ మ‌ధ్యే ఆ రేసులో వెన‌క‌బ‌డ్డారు. సంక్రాంతికి వ‌స్తున్నాంతో వెంకీ, మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో మెగాస్టార్స్ సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకున్నారు. తాను కూడా అదే త‌ర‌హాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సంక్రాంతికి ద‌క్కించుకోవాల‌నే బాల‌య్య ఇలా ప‌ట్టుబ‌డుతున్నారా? అచే చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News