అల్లుడు శీను పెళ్లా.. మజాకానా! బెల్లంకొండ తగ్గేదేలే!!
టాలీవుడ్ యంగ్ హీరో, `అల్లుడు శీను` ఫేమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో, `అల్లుడు శీను` ఫేమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ యువ హీరో పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలకు స్వయంగా శ్రీనివాసే తెరదించారు. తన మనసు గెలుచుకున్న కావ్య రెడ్డిని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. తాను వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో బెల్లంకొండ అభిమానుల్లో సందడి మొదలైంది.
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ వివాహం తర్వాత టాలీవుడ్ లో మరో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ శీనుదేనంటూ చర్చ సాగుతోంది. శీను తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రెస్టేజ్ లో ఎక్కడా తగ్గరు. ఆ ఇద్దరు హీరోలకు ధీటుగా తన కుమారుడి వివాహం కోసం అత్యంత భారీగా ఆయన బడ్జెట్ ని కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. శీను సినిమాల కోసం బెల్లంకొండ సురేష్ నిర్మించిన భారీ సెట్లు, వాటి బడ్జెట్లు చూసిన వారికి.. అంతకుముందు ఏ స్టార్ హీరోకి కానీ, ఏ నటవారసుడికి కానీ ఈ రేంజు సెట్లు లేవు అని అంగీకరించారు.. ఆ రేంజులో శీను కోసం సెట్లు వేయించిన ఘనత సురేష్ కే చెల్లుతుంది.. అందుకే ఇప్పుడు కుమారుడి పెళ్లి ఈవెంట్ అంటే అంతకుమించి ఆయన ప్రణాళికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు... కొడుకును హీరోని చేయడమే కాదు.. పోటీలో నిలదొక్కుకునేంతగా తీర్చిదిద్దారు బెల్లంకొండ సురేష్.. ఇప్పుడు కుమారుడు లైఫ్ లో సెటిలవుతున్నాడంటే ఏ నటవారసుడి పెళ్లికి తీసిపోని రేంజులో ఈ పెళ్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు..
ఇక శ్రీనివాస్ పెళ్లాడబోయే వధువు కావ్య రెడ్డి నేపథ్యం ఆసక్తికరం. కావ్య ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉన్నత విద్యావంతురాలు కావడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. బెల్లంకొండ కుటుంబంతో కావ్య కుటుంబానికి ఉన్న పాత పరిచయాలే ఈ పెళ్లికి పునాది వేసినట్లు టాలీవుడ్ లో టాక్ ఉంది. కావ్య రెడ్డికి కేవలం కార్పొరేట్ రంగంలోనే కాకుండా, కళలు- సంస్కృతిపై కూడా మంచి అవగాహన ఉందని సమాచారం. ఆమె హుందాతనం, సౌమ్య స్వభావం బెల్లంకొండ సురేష్ కుటుంబానికి బాగా నచ్చాయని, అందుకే శ్రీనివాస్ తన జీవిత భాగస్వామిగా ఆమెను ఎంచుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాబోయే కోడలిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఈ పెళ్లి వేడుకను ఒక పండగలా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు అంచనా వేస్తున్నారు.
తన కాబోయే భార్యను పరిచయం చేస్తూ సాయి శ్రీనివాస్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ``నా జీవితంలోకి వచ్చి ఎనలేని సంతోషాన్ని ఇచ్చినందుకు కావ్యకు థాంక్స్. నీ ముఖంలోని ఆ చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనమిద్దరం ఒక్కటయ్యే శుభ ముహూర్తం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను`` అంటూ తన ప్రేమను ఎంతో హృద్యంగా వ్యక్తపరిచారు. ఈ ప్రకటన కేవలం ఆరంభం మాత్రమేనని.. త్వరలోనే పెళ్లి తేదీని అధికారికంగా వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
మొత్తానికి అల్లుడు శీను ఒక ఇంటికి అల్లుడైపోతున్నందుకు.. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందున.. అటు ఫ్యాన్స్, ఇటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ లేదా హైదరాబాద్‌లోనే అద్భుతమైన సెట్ మధ్య ఈ కళ్యాణం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.