అప్పుడు దానయ్యకు జాక్ పాట్.. మరి ఇప్పుడు?
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒక సినిమా విజయం సాధిస్తే, దాని రెండో పార్ట్ ను మరింత హై రేంజ్ లో రూపొందించేందుకు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒక సినిమా విజయం సాధిస్తే, దాని రెండో పార్ట్ ను మరింత హై రేంజ్ లో రూపొందించేందుకు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అదే సమయంలో తొలి భాగాన్ని నిర్మించిన సంస్థకు బదులుగా సీక్వెల్ ను మరో బ్యానర్ రూపొందించడం ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలోనూ అదే చర్చ జరుగుతోంది.
యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఓజీ ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించిన అన్ని అంశాలను అందించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్లతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
ఓజీ విడుదల సమయంలో ఆ కథకు ప్రీక్వెల్/ సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి రెండో పార్ట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్ తన ఫారిన్ టూర్ పూర్తి చేసుకున్న తర్వాత ఓజీ-2కు సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే నెట్టింట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ మాత్రం నిర్మాత విషయంలోనే. తొలి భాగాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. కానీ సీక్వెల్ కు ఆయన నిర్మాతగా ఉండకపోవచ్చనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
కాగా, ఓజీ సినిమా ద్వారా డీవీవీ దానయ్యకు మంచి ఆర్థిక లాభాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. సినిమా విడుదలకు ముందే వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు, ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కులను విక్రయించడం ద్వారా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
సినిమా బడ్జెట్ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, విడుదలకు ముందే జరిగిన బిజినెస్ కారణంగా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ లభించినట్లు టాక్ వినిపించింది. బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి వసూళ్లు సాధించడంతో నిర్మాతకు మరింత బలం చేకూరిందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం ఓజీ-2పై అంచనాలను మరింత పెంచుతోంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ తో రెండో పార్ట్ మార్కెట్ వాల్యూ భారీగా పెరిగే అవకాశం ఉంది.
విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆ ఛాన్స్ ను ఏ బ్యానర్ దక్కించుకుంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదన్న విషయం తెలిసిందే.
ఏదేమైనా ఓజీ ఫస్ట్ పార్ట్ నిర్మాతకు జాక్ పాట్ గా మారితే, ఇప్పుడు ఓజీ-2కి ఆ ఛాన్స్ ఎవరికి సొంతం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆ చర్చలకు ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపించడం లేదు. అభిమానులు మాత్రం మరోసారి పవన్- సుజీత్ కాంబోలో మ్యాజిక్ చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.