రీప్లేస్మెంట్ వెనుక అసలు కారణాన్ని బయటపెట్టిన నటి!
తొలుత కాస్త బాధగా అనిపించినా? సినిమా ఇండస్ట్రీలో చివరి నిమిషంలో ఇలాంటి మార్పులు సహజమేనని మనసుకు సర్ది చెప్పుకున్నానన్నారు.
బాలీవుడ్ క్లాసిక్స్ లో `మైనే ప్యార్ కియా` చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. వారి కెరీర్‌లను మలుపు తిప్పిన గొప్ప చిత్రమిది. తాజాగా ఈ ఐకానిక్ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర నిజం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సీనియర్ నటి , కమెడియన్ ఉపాసన సింగ్ తొలు ఈ సినిమాలో నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో మరొకరు వచ్చారని వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన సింగ్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఈ అవకాశం గురించి గుర్తు చేసుకున్నారు.
`మైనే ప్యార్ కియా` చిత్ర ఆడిషన్స్ సమయంలో దర్శకుడు సూరజ్ బర్జాత్యా నా నటన చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారన్నారు. ఆ పాత్రకు తనను ఎంపిక చేశారని ఆమె తెలిపారు. ఆ సమయంలో ఇంతపెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి అవకాశం రావడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆ ప్రాజెక్ట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని ఉపాసన పేర్కొన్నారు. `అయితే సినిమా పట్టాలెక్కే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. ఉపాసన సింగ్ స్థానంలో భాగ్యశ్రీని కథానాయికగా ఎంపిక చేశారన్నారు. దీనికి గల కారణాలను రవీల్ చేసారు. అప్పట్లో మేకర్స్ తీసుకున్న కొన్ని సృజనాత్మక నిర్ణయాలు ..నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ కాంబినేషన్ల మార్పుల వల్లే ఈ ప్రాజెక్ట్ నుండి తాను తప్పుకోవాల్సి వచ్చిందన్నారు ఉపాసన.
తొలుత కాస్త బాధగా అనిపించినా? సినిమా ఇండస్ట్రీలో చివరి నిమిషంలో ఇలాంటి మార్పులు సహజమేనని మనసుకు సర్ది చెప్పుకున్నానన్నారు. ఒక భారీ బ్లాక్‌బస్టర్ సినిమాను కోల్పోవడం ఏ నటికైనా కెరీర్ పరంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఒకవేళ ఉపాసన ఆ సినిమాలో నటించి ఉంటే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా భిన్నంగా ఉండేదేమో. కానీ ఉపాసన సింగ్ ఆ పరిణామానికి కృంగిపోకుండా తనదైన శైలిలో పరిశ్రమలో ముందుకు సాగారు. `జుడ్వా` వంటి చిత్రాలతో పాటు పలు విజయవం తమైన సినిమాలు.. టెలివిజన్ షోలలో నటించి వర్సటైల్ నటిగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
సినిమా పరిశ్రమలో అదృష్టం, సమయం'అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకరిని వరించాల్సిన అవకాశం మరొకరిని వరించడం తద్వారా వారు రాత్రికి రాత్రే స్టార్స్ అవ్వడం ఇక్కడ తరచూ చూస్తూనే ఉంటాం. `మైనే ప్యార్ కియా` చిత్రం భాగ్యశ్రీ తలరాతను మార్చేసింది. అదే సమయంలో ఉపాసన సింగ్ కూడా మెయిన్ లీడ్ కాకపోయినా దశాబ్దాల పాటు పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలతో సుస్థిర స్థానాన్ని కాపాడుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. గతాన్ని తలుచుకుని బాధపడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదగడమే అసలైన విజయమని ఉపాసన సింగ్ నిరూపించారు. సినిమా అవకాశాలు రావడం, చేజారిపోవడం అనేవి వృత్తిలో భాగమేనని ఉపాసన సింగ్ ఎంతో పరిణతితో స్వీక రించారు. గ్లామర్ ప్రపంచంలో అస్థిరతను తట్టుకుని, సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకులను అలరించడం సామాన్య విషయం కాదు. ఈ విషయంలో ఉపాసన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.