• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ మాసు.. బన్నీ క్లాసు...

మహేష్ మాసు.. బన్నీ క్లాసు మధ్య మంచివాడి సంగతి?

By - Tupaki Desk
Update: 2020-01-13 06:04 GMT
సంక్రాంతి సినిమాలు మొత్తం నాలుగు.. వాటిలో ఇప్పటికే మూడు విడుదలయ్యాయి. రజనికాంత్ 'దర్బార్'..  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ఇప్పటికీ రిలీజ్ కాగా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సంక్రాంతి సినిమాలలో పెద్దగా హైప్ లేకుండా వస్తున్న సినిమా ఇదే. మరి ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
 
రజనికాంత్ 'దర్బార్ ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకో లేదు. కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి.  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు యావరేజ్ రివ్యూస్.. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా ఉన్నాయి.  సంక్రాంతి శెలవుల ఎడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ వసూళ్ల జోరు మరికొన్ని రోజు కొనసాగే అవకాశం ఉంది.  సంక్రాంతి హాలిడేస్ పూర్తయితే కానీ 'సరిలేరు నీకెవ్వరు' రేంజ్ తెలిసే అవకాశం లేదు. ఇక అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' కు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్ బ్రాండ్ తో అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో ఈ సినిమా దుమ్ము లేపడం ఖాయమని అంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కానున్న 'ఎంత మంచివాడవురా' కు ఎంతమంది ప్రేక్షకులు ఓటేస్తారనేది సినిమాకు వచ్చే టాక్ ను బట్టే తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటి వరకూ ప్రేక్షకులకు ఫస్ట్.. సెకండ్ ఛాయిస్ గా అల్లు అర్జున్.. మహేష్ బాబు సినిమాలే ఉన్నాయి.  ఈ సినిమాలు దాటి కళ్యాణ్ సినిమాను చూడలంటే తప్పని సరిగా సూపర్ హిట్ టాక్ రావాలి. లేకపోతే మంచి వాడికి కష్టమే అంటున్నారు.  ఈ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న 'శతమానం భవతి' లాంటి హిట్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నప్పటికీ 'శ్రీనివాస్ కళ్యాణం' తో నిరాశపరిచాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలడా లేదా అనేది చూడాలి.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Sarileru Neekevvaru Teaser 
  • Mahesh Babu Dialouges In Sarileru Neekevvaru 
  • Mega Guest For Sarileru Neekevvaru Event 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tamannah 
  • Tamannah In Sarileru Neekevvaru 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS