• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఎనిమీ' ట్రైలర్:...

'ఎనిమీ' ట్రైలర్: శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ..!

By - Tupaki Desk
Update: 2021-10-23 13:34 GMT
కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ లో విశాల్ - ఆర్య ఇద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా.. ప్రకాష్ రాజ్ - తంబి రామయ్య వారి తండ్రులుగా కనిపిస్తున్నారు. పోటీ వస్తే మీరిద్దరూ శత్రువులే.. కానీ మిగతా సమయాల్లో మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రకాష్ రాజ్ వాళ్ళకి చెబుతున్నారు. అయితే సింగపూర్ లో ఓ ప్రమాదంలో 11 మంది మరణించగా.. దానికి ఆర్య కారణమని అనుమానించి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విశాల్ ఇందులో పోలీసు పాత్రలో కనిపిస్తున్నారు.

భారీ యాక్షన్ సీక్వెన్సులు - ఛేజింగ్ సన్నివేశాలతో నిండిన ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్‌డి రాజశేఖర్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విలక్షణ నటుడు మమతా మోహన్ దాస్ - కరుణాకరన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథే 'ఎనిమీ' సినిమా అని తెలుస్తోంది. స్నేహితులైన విశాల్ - ఆర్య శత్రువులుగా ఎలా మారారు? దీని వెనకున్న అసలు కథేమిటి? అనేది తెలియాలంటే 'ఎనిమీ' సినిమా విడుదలయ్య వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ఎస్.ఎస్‌ థమన్ సాంగ్స్ కంపోజ్ చేయగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. రేమాండ్ డేర్రిక్ క్రాస్తా ఎడిటింగ్ వర్క్ చేయగా.. రవి వర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాడు - వీడు' సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత విశాల్ - ఆర్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 'పెద్దన్న' చిత్రానికి పోటీగా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ''ఎనిమీ'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • Enemy 
  • Official Trailer 
  • Kollywood 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS