టాలీవుడ్ స్టార్ కపుల్ 'లవ్ స్టోరీ'కి ది ఎండ్?

Update: 2021-08-29 00:30 GMT
టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ 'లవ్ స్టోరీ'కి త్వరలోనే ది ఎండ్ పడబోతోందని ఫిల్మ్ నగర్ లో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో, హీరోయిన్ల మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ స్టార్ కపుల్ త్వరలోనే తమ వివాహబంధానికి బ్రేకప్ చెప్పుకోబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరినీ కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఎంతోమందికి జంటలకు స్ఫూర్తినిచ్చిన ఈ జంట...కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.

తమ కెరీర్‌లో పీక్ దశలో ఉన్న ఈ జంట...విడిపోయేందుకు సిద్ధపడుతున్నారని, రాజీ పడేందుకు విముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ టాప్ హీరోయిన్ కు సంబంధించి షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన ఫ్యామిలీ కి టైమ్ కేటాయించబోతోందంటూ కథనాలు కూడా వచ్చాయి. సదరు హీరోకన్నా హీరోయిన్ కే స్టార్ డమ్ ఎక్కువని, ఈ ఇగో క్లష్ వల్లే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికితోడు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ అంశంపై వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మీడియాకు వెల్లడించింది.

ఆ విమర్శలు వచ్చిన అంశం తాజాగా ఆ జంట విడాకులపై వచ్చిన పుకార్లకు ఊతమిచ్చేలా ఉంది. అయితే, ఈ విషయంపై సదరు హీరో, హీరోయిన్ ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలుబెట్టారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయి, వారు కలిసిమెలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విడాకుల విషయం కేవలం పుకారుగానే మిగిలిపోవాలని ఆ స్టార్ హీరో ఫ్యామిలీ అభిమానులతో పాటు హీరోయిన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి వారు కోరుకుంటున్నట్లు స్టార్ కపుల్ విడాకులవి ఉత్త పుకార్లా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.




Tags:    

Similar News