ఆరంగేట్ర‌మే భాయ్ కంట్లో ప‌డింది.. ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు!

Update: 2020-12-05 23:30 GMT
స్వీడ‌న్ కు చెందిన ఎల్లీ అవ్రామ్ అవార్డుల కార్య‌క్ర‌మంతో బాలీవుడ్ మేక‌ర్స్ ‌కి బౌన్స‌ర్ వేసింది. స్టార్ ఎంట‌ర్ ‌టైన్ ‌మెంట్స్ అవార్డు ఫంక్ష‌న్ లో స్పెష‌ల్ ఎంట్రీ ఇచ్చి తొలి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తోనే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ‌ని క్లీన్ బౌల్డ్ చేసింది. ఆరంగేట్ర‌మే భాయ్ కంట్లో ప‌డింది. ఆ త‌రువాత బాలీవుడ్ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించి `మిక్కీ వైర‌స్‌`తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

ఐదారేళ్ల కెరీర్ లో ఎన్నో ఐటెమ్ నంబ‌ర్ల‌లోనూ న‌ర్తించి హాట్ గాళ్ గా పాపుల‌రైంది. టీమిండియా క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యాతో ప్రేమాయ‌ణం సాగించి వార్త‌ల్లో నిలిచింది. ఇద్ద‌రూ జోరుగా చెట్ట‌ప‌ట్టాల్ అంటూ తిరిగేస్తూ మీడియా కంట‌ప‌డ్డారు. ఆ త‌రువాత ఎల్లీకి షాకిచ్చిన హ‌ర్థిక్‌ పాండ్యా న‌టాషా స్టాంకోవిక్ ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అత‌డి‌ని లైట్ తీసుకున్న ఎల్లీ కెరీర్ పై దృష్టిపెట్టింది. ప్ర‌స్తుతం `క్వీన్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్నక‌న్న‌డ చిత్రం `బ‌ట‌ర్‌ఫ్లై`, హిందీలో `రూఅఫ్జా` చిత్రాల్లో న‌టిస్తోంది.

తాజాగా త‌ను బాలీవుడ్ లోకి ప్ర‌వేశించిన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది ఎల్లీ. స్టార్ టీవీ అవార్డ్స్ ఫంక్ష‌న్ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన ఎల్లీ అవ్రామ్ ఈ వీడియోతో పాటు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేసింది. `2013 నేను బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు ఒక అవార్డుల‌ వేడుక‌లో నా మొదటి ప్రత్యక్ష ప్రదర్శనకుకు సంబంధించిన త్రోబాక్ వీడియో ఇది. ఈ ఫంక్ష‌న్ లో డ్యాన్సులు చేసే స‌మ‌యానికి చాలా నెర్వ‌స్ ‌గా వున్నాను. చివ‌రి‌కి ఈ ప్ర‌ద‌ర్శ‌న కోసం చాలా ఎక్జైట్ అయ్యాను. అంతులేని ఆనందంతో తిరిగి నేను స్వీడన్లోని ఇంటికి తిరిగి వెళ్లాలని కలలుక‌న్నాను. కలలు క‌నండి ఆ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌డానికి ధైర్యంగా ముంద‌డుగు వేయండి.. అందుకోసం ఆత్మ‌విశ్వాసం కృషి చిత్త‌శుద్దితో ధైర్యంగా ముంద‌డుగు వేయండి` అని ఆస‌క్తిక‌రంగా స్ఫూర్తి నింపే విష‌యం షేర్ చేసింది ఎల్లీ అవ్ర‌మ్‌.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CIVCphehNgR/
Tags:    

Similar News