తెలుగమ్మాయికి మరో ఛాన్స్
తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఏమో కాని కనీసం హీరోయిన్ గా కూడా ఆఫర్లు దక్కించుకోవడంలో సఫలం అవ్వడం లేదు. ఒకరు ఇద్దరు మాత్రం చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో ఒక హీరోయిన్ ఈషా రెబ్బా. ఈమె చిన్న హీరోల సరసన నటిస్తూ కెరీర్ ను సాగిస్తుంది. వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న ఈమె ఆమద్య పెద్ద హీరో ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నటించింది. కాని ఆ సినిమా ఈషా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడినది లేదు.
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ లో నటించిన ఈషా రెబ్బా తాజాగా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంను చేస్తున్న సుశాంత్ ఆ తర్వాత సినిమాకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా ఈషా రెబ్బను ఎంపిక చేశారు. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈషా రెబ్బకు సుశాంత్ మూవీతో అయినా ఆ ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.