కొణిదెల పవన్ తేజ్ 'ఈ కథలో పాత్రలు కల్పితం' టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు..!
కొణిదెల పవన్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ అభిరామ్ ఎమ్. దర్శకత్వం వహిస్తున్న సినిమా ''ఈ కథలో పాత్రలు కల్పితం''. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాడు. ఇందులో మేఘన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలకు మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డిసెంబర్ 18న చిత్ర టీజర్ ని మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు రిలీజ్ చేశాడు.
'ఈ కథలో పాత్రలు కల్పితం' టీజర్ లో మిస్టరీగా మారిన ఓ కేసును ఛేదించే క్రమంలో హీరో మరియు పోలీసుల మధ్య జరిగే స్టోరీ అని తెలుస్తోంది. సీనియర్ నటుడు పృథ్వీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ తేజ్ యాక్షన్ సన్నివేశాలపై బాగా ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. దీనికి సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ అందించిన విజువల్స్.. కార్తీక్ కొడకండ్ల ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్ చెప్తూ వస్తున్న రేంజ్ లో ఈ టీజర్ లేదనే చెప్పాలి. 'ఆర్‌ఎక్స్ 100' చిత్రానికి డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ ఈ చిత్రానికి మాటలు మరియు అడిషినల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Full View