శ‌ర్వానంద్ సెకెండ్ ఇన్నింగ్స్ అందుకున్న‌ట్లేనా!

యంగ్ హీరో శ‌ర్వానంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌తుంది. `మ‌హానుభావుడు` త‌ర్వాత న‌టించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.;

Update: 2026-01-23 11:30 GMT

యంగ్ హీరో శ‌ర్వానంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌తుంది. `మ‌హానుభావుడు` త‌ర్వాత న‌టించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో విజ‌యం అన్న‌ది అంద‌ని ద్రాక్ష‌లా మారింది. ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. జాన‌ర్లు మార్చినా? ద‌ర్శ‌కుల్ని మార్చినా? ఛేంజ్ అవ్వ‌డం వ‌ర‌కే త‌ప్ప రిజ‌ల్ట్ రూపంలో క‌నిపించ‌లేదు. మ‌రోవైపు వివాహం చేసుకుని జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించాడు. ఆ సెంటిమెంట్ అయినా కలిసొచ్చిందా? అంటే అదీ జ‌ర‌గ‌లేదు. ఏదైతేనేం మొత్తానికి తొమ్మిదేళ్ల త‌ర్వాత `నారీ నారీ న‌డుమ మురారీ`తో డీసెంట్ హిట్ అందుకున్నాడు.

సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చాయి. ప‌బ్లిక్ టాక్ బాగుంది. సినిమాపై ఎక్క‌డా నెగివిటీ స్ప్రెడ్ అవ్వ‌లేదు. పోటీగా కొన్ని సినిమాలున్నా? శ‌ర్వా సినిమాకు వెళ్లాల్సిన జ‌నాలు వెళ్తున్నారు. థియేట‌ర్ల‌ను పెంచితే ఇంకా మంచి వ‌సూళ్లు సాధించ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ మిగ‌తా రెండు సినిమాలు కూడా బాగా ఆడ‌టంతో? ఇప్ప‌ట్లో థియేట‌ర్లో దొర‌క‌డం క‌ష్టం. థియేట‌ర్లలో షోస్ ను అడ్జ‌స్ట్ చేయ‌గ‌ల్గినా బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్లు బాగుంటాయి. స‌క్సస్ ప‌రంగా శ‌ర్వానంద్ సంతోషంగా ఉన్నాడు. చాలా కాలం త‌ర్వాత వ‌చ్చిన విజ‌యాన్ని కుటుంబం, స్నేహితుల‌తో సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు.

అయితే ఈ విజ‌యాన్ని శ‌ర్వానంద్ కంటున్యూ చేయాలి. రిలాక్స్ అవ్వ‌డానికి ఛాన్స్ లేదు. మార్కెట్ లో తీవ్ర‌మైన పోటీ ఉంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా రెండు సినిమాలు తెర‌క‌క్కుతున్నాయి. `బైక‌ర్` పై చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. కెరీర్లో ఓ గొప్ప చిత్రంగా `బైక‌ర్` నిలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు. `బైక‌ర్` గురించి ఇండియా అంత‌టా మాట్లాడుకునేలా ఉంటుంద‌న్నాడు. అభిలాష్ కంకర బైక‌ర్ ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నాడు. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపిస్తాడు.

మాళవిక నాయర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో `భోగి`లో న‌టిస్తున్నాడు. సంపత్ నంది మార్కు ఊర మాస్ అంశాలతో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అలాగే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలన్న‌ది ప్లాన్. ప్ర‌స్తుతానికి శ‌ర్వానంద్ ఈ మూడు ప్రాజెక్ట్ ల‌పైనే సీరియ‌స్ గా ప‌ని చేస్తున్నాడు. ఇవి విజ‌యం సాధిస్తే శ‌ర్వానంద్ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. కొన్నాళ్ల పాటు మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌ని ఉండ‌దు.

Tags:    

Similar News