స్వాతిముత్యాలు ఆయన సొంతం

Update: 2015-10-05 04:07 GMT
తెలుగు సినీ కళామతల్లి గర్వించదగ్గ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన ఏడిద నాగేశ్వరరావుగారు నిన్న స్వర్గస్థులైన సంగతి తెలిసినదే. ఆయన మరణంతో నిజంగానే ఒక శకం ముగిసింది. శంకరాభరణం రాగం మూగబోయింది.. స్వాతిముత్యం సాగరంలో సంగమమైపోయింది.. సిరి సిరి మువ్వ శబ్దం ఆగిపోయింది..

క్రేజ్ కి ఇమేజ్ కి దూరంగా నిలుస్తూ కధను బట్టి పాట తీరుని మారుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటే గుండెలమీద చెయ్యివేసుకుని ఇది నేను తీసిన సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగిన చిత్రాలు పూర్ణోదయ సొంతం. చిరంజీవి చేత చెప్పులు కుట్టించాడు. కమల్ చేత వెర్రి బాగుల వేషం వేయించాడు. హీరోని చివరికి చంపేశాడు. యాభై ఏళ్ళ నటుడితో ప్రాధాన పాత్రలో సినిమా తీశారు.. ఇవన్నీ సంచలనాలే.. ఇవన్నీ సగర్వ సినిమాలే..

తీరుకి ఎదురీది నెగ్గుకురావడం కాస్త కష్టతరమైన పనే. సినిమా రంగంలో మరింత కష్టంతో కూడుకుంది. కానీ ఆ కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని నిర్మించిన ప్రతీ సినిమా ఒక కళాఖండంగా మలచిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అభిలాష వున్న నిర్మాతలు ఉండాలేగానీ స్వయంకృషులకు కొదవలేదని విశ్వనాద్ ద్వారా ఏడిద వారు నిరువుపించారు. నేటి తరం నిర్మాతలు ఆయాన్ని ఆదర్శప్రాయంగా తీసుకుంటారని కోరుకుంటూ శెలవు... 
Tags:    

Similar News