• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ హీరోయిన్ల డూప్...

టాప్ హీరోయిన్ల డూప్ సీక్రెట్ లీక్‌!

By - Tupaki Desk
Update: 2018-07-29 03:30 GMT
భారీ బ‌డ్జెట్ల‌తో పురాణేతిహాసాల్ని వెండితెర‌కెక్కిస్తున్నారు మ‌న ద‌ర్శ‌కులు. అలాంటి సినిమాల్లో ప్ర‌తి పాత్ర‌కు మేక‌ప్ ప‌రంగా కానీ - ఆహార్యం ప‌రంగా కానీ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కాస్ట్యూమ్స్ అంతే భారీగా ఉంటాయి. రాణీవారిలానో - లేక అమ్మోరిలానో - లేక ఏకంగా దేవ‌తా సుంద‌రిగానో న‌టించాల్సి వ‌స్తే ఆ పాత్ర‌కు కాస్ట్యూమ్స్‌ - మేక‌ప్ అతి భారీగా ఉండాల్సిందే. పైగా గంట‌ల‌కు గంట‌లు ఆన్ లొకేష‌న్ మేక‌ప్‌ కే స‌రిపోతుంది. అయితే ఇలాంటి స‌న్నివేశంలో భారీగా ఆభ‌ర‌ణాలు - కాస్ట్యూమ్స్ మోయ‌లేనంత బ‌రువు మోయాలంటే కొంద‌రు టాప్ హీరోయిన్లు అంగీక‌రించ‌ని స‌న్నివేశం ఉంటుందిట‌. మ‌రి వాళ్లు న‌గ‌లు పెట్టుకుని - బ‌రువైన కాస్ట్యూమ్స్ ధ‌రించ‌క‌పోతే సీన్ తీయ‌డ‌మెలా? అంటారా? అక్క‌డే త‌ప్పులో అడుగేశారు.

స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశం త‌లెత్తితే దానిని మ్యానేజ్ చేసేందుకు చిత్రాంగ‌ద‌ల‌ను బ‌రిలో దించుతార‌ట‌. చిత్రాంగ‌ద అంటే ఇక్క‌డ డూప్ అని అర్థం. అందాల క‌థానాయిక‌లు భారీ - అతి భారీ ఆభ‌ర‌ణాలు ధ‌రించే స‌న్నివేశం వ‌చ్చిన‌ప్పుడు ఆ స్థానంలో డూప్ ఆ న‌గ‌ల్ని - బ‌రువైన కాస్ట్యూమ్స్‌ ని ధ‌రించి న‌టిస్తుంది. అయితే ఫేస్ క్లోజ్‌ గా క‌నిపించే సీన్స్ త‌న‌పై తీయ‌రు. ఫేస్ క‌నిపించేవి - క్లోజ‌ప్ షాట్స్ వంటివి స‌ద‌రు నాయిక‌పై తీసినా ఇత‌ర‌త్రా సీన్స్ అన్నీ ఈ డూప్‌ పైనే చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని ఇలా హీరోయిన్ల‌కు డూప్‌ గా న‌టించే ఓ న‌వ‌య‌వ్వ‌ని తుపాకితో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ చెప్పుకొచ్చింది. తాను ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర‌క‌థానాయిక‌లంద‌రికీ ఏదో ఒక సంద‌ర్భంలో డూప్‌ గా న‌టించాన‌ని తెలిపింది. ఇలా డూప్‌ గా న‌టించ‌డం న‌ర‌కం అని - డ‌బ్బు కోసం త‌ప్ప‌ద‌ని కూడా సెల‌విచ్చింది. అస‌లింత‌కీ హీరోయిన్ల‌కు డూప్‌ ల‌ను ఎవ‌రు స‌ర‌ఫ‌రా చేస్తారు? అంటే అందుకు ప్ర‌త్యేకించి కొంద‌రు ఆడాళ్లు ఇండ‌స్ట్రీలో ఉంటార‌ని తెలిపింది. వార్నీ!!
Tags:    
  • Dupes for Heroines 
  • Heroines Dupes 
  • Heroines 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS