• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘మహానటి’లో అతడిని...

‘మహానటి’లో అతడిని మరిచిపోకండి

By - Tupaki Desk
Update: 2018-05-14 23:30 GMT
గత ఐదారు రోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘మహానటి’ మీదే ఉంది. ఆ సినిమాను పొగడని ప్రేక్షకుడు లేడు. దాని గురించి నెగెటివ్ గా మాట్లాడేవాళ్లే లేరు. ఇందులో చెప్పుకోవడానికి చాలా హైలైట్లు ఉన్నాయి. ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. ఐతే నటీనటుల్లో అందరి చర్చలూ కీర్తి సురేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమె సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా నటిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సినిమా ముందు వరకు కీర్తి నటిగా పెద్దగా రుజువు చేసుకున్నది లేదు. చేసినవి చాలా మామూలు పాత్రలే. సావిత్రి పోలికలైతే ఉన్నాయి కానీ.. నటనలో ఆమెను కీర్తి మ్యాచ్ చేయగలదా అని అందరూ సందేహించారు. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ అద్భుత అభినయంతో కట్టిపడేసింది కీర్తి. అందుకే అందరూ కీర్తి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు.

ఐతే కీర్తి స్థాయిలో పాత్ర.. వేరియేషన్లు లేకపోవచ్చు కానీ.. ఇందులో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటనను ఎంత పొగిడినా తక్కువే. చాలా ఈజ్ తో.. మెచ్యూరిటీతో ఆ పాత్రలో మెప్పించాడు దుల్కర్. నిజానికి సావిత్రి జీవితంలో జెమినీనే విలన్. సావిత్రి అభిమానులకు జెమిని అంటే పడదు. అతడి వల్లే ఆమె జీవితం నాశనమైందని అనుకుంటారరు. ఐతే దుల్కర్ కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ వల్ల  సినిమాలో మాత్రం జెమిని పాత్రను అందరూ ప్రేమిస్తారు. వాస్తవ జీవితంలో ఉన్న నెగెటివిటీని పూర్తిగా చూపిస్తే ఇబ్బంది కాబట్టి ఆ పాత్రను కొంచెం మార్చి చూపించారు. పైగా దుల్కర్ అద్భుత అభినయంతో.. స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేయడంతో ప్రేక్షకులు ఆ పాత్రను చాలా ఇష్టపడతారు. ద్వితీయార్ధంలో తనలోని నెగెటివ్ కోణాన్ని చూపించే సన్నివేశాల్లో దుల్కర్ నటన అతడెంత గొప్ప నటుడో చాటి చెబుతుంది. ఈ పాత్ర కోసం సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు దుల్కర్. అది పర్ఫెక్టుగా సెట్ అయింది. లుక్ విషయంలో జెమినికి దగ్గరగా లేకపోయినా.. హావభావాలతో ఆ పాత్రను మ్యాచ్ చేయగలిగాడు దుల్కర్. సావిత్రి పాత్రకు ఉన్న ప్రాధాన్యం.. కీర్తి అంచనాలకు మించి చేయడంతో అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. సినిమాలో దుల్కర్ నటన కూడా అసామాన్యమైనది. అతడి గురించి మరిచిపోతే అది తప్పే అవుతుంది.


Tags:    
  • Dulquer Salmaan 
  • Mahanati Movie 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS