• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహానటిలో అతని పని...

మహానటిలో అతని పని పూర్తయ్యింది

By - Tupaki Desk
Update: 2018-01-18 08:05 GMT
టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి ఒక మహానటి జీవిత కథ తెరపై చూడటానికి సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహానటి సావిత్రి బయోపిక్ షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తోన్న ఈ ప్రయోగంపై భారీ అంచనాలు ఉన్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే గత కొంత కాలంగా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఎక్కువగా దర్శకుడు ఆ కాలం నాటి సెట్స్ వేసి షూటింగ్ ని నిర్వహించాడు. ఇక సినిమాలో సమంత తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. జెమినీ గణేషన్ పాత్రలో కనిపిస్తోన్న దుల్కర్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయింది. అయితే మొన్నటి వరకు హీరోగా అలరించిన దుల్కర్ ఇప్పుడు కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడు. సావిత్రి జీవితంలో కోలీవుడ్ హీరో జెమినీ గణేషన్ పాత్ర చాలా కీలకమైంది. ఆయన వల్లే సావిత్రి జీవితం ఒక్కసారిగా తలక్రిందులైందని చెబుతుంటారు.  మరి అలాంటి డిఫెరెంట్ క్యారెక్టర్ ని మనోడు ఎలా బ్యాలెన్స్ చేశాడు అనేది తెరపై చూడాలి.

అలాగే నాగ్ అశ్విన్ టేకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటివరకు సావిత్రి బయోపిక్ కి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఎక్కువగా కాంట్రావర్షియల్ కూడా కాలేదు. అలాంటి వాటికి తావివ్వకుండా చిత్ర యూనిట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. వీలైనంత త్వరగా స్పెషల్ టీజర్ ద్వారా ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇక సినిమాను మార్చ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Tags:    
  • Dulquer Salmaan 
  • Mahanati Movie 
  • Telugu NEws 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS