• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్ బాగున్నా వసూళ్లు...

టాక్ బాగున్నా వసూళ్లు పూర్

By - Tupaki Desk
Update: 2018-06-17 11:57 GMT
కొంత కాలంగా యుఎస్ లో తెలుగు సినిమాల సందడేం పెద్దగా కనిపించడం లేదు. మే నెలలో ‘భరత్ అనే నేను’ మహానటి సందడి చేశాక.. ఇంకే సినిమా కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అందులోనూ ఈ నెలలో వచ్చిన సినిమాలన్నీ అక్కడ తుస్సుమనిపించాయి. తొలి వారంలో విడుదలైన ‘ఆఫీసర్’.. ‘రాజుగాడు’ అడ్రస్ లేకుండా పోయాయి. తర్వాతి వారం వచ్చిన ‘కాలా’ కూడా సత్తా చాటలేదు. ఇక ఈ వారాంతంలో ఒకటికి రెండు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒక సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. దాని గురించి పట్టించుకునేవాళ్లే లేరు. ఇంకో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు.

నందమూరి కళ్యాణ్ రామ్-తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ సినిమాకు ఎంత పేలవమైన టాక్ వచ్చిందో తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీకెండ్లో మంచి వసూళ్లు వచ్చే శనివారం ఈ చిత్రం కేవలం 9 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. దీనికి పోటీగా విడుదలైన ‘సమ్మోహనం’కు మంచి టాకే వచ్చింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. గురు, శుక్రవారాల్లో కలిపి ఈ చిత్రం 1.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. శనివారం వసూళ్లు పుంజుకుంటాయని.. పెద్ద నంబర్లే నమోదవుతాయని ఆశించారు. కానీ ఈ చిత్రం 1.2 లక్షల డాలర్లే వసూలు చేసింది. యుఎస్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమానే అయినా.. పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకున్నా ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ‘మహానటి’ సినిమాలో స్టార్ పవర్ లేకున్నా కూడా ఆ చిత్రం మిలియన్లు మిలియన్లు కొల్లగొట్టింది. కానీ ‘సమ్మోహనం’ దాంతో పోలిస్తే చాలా పూర్ గా పెర్ఫామ్ చేస్తోంది. సుధీర్ బాబుకు అసలిక్కడ ఏమాత్రం మార్కెట్ లేకపోవడం ప్రతికూలంగా మారినట్లుంది.
Tags:    
  • Dull Weekend 
  • Telugu Films 
  • Overseas 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS