డ్రగ్స్ దందా టర్నోవర్ ఎంత ఉండొచ్చు?
ఒకప్పుడు ఒక పర్టికులర్ వస్తువు కాని ఏదన్నా పని కాని ఇల్లీగల్ అయితే.. దానికి ఇంత రేటు అని ఉండేది. అది ఒకరో ఇద్దరో అమ్మడం లేదా ఒకరో ఇద్దరో అలాంటి పనులు చేయడం చేసేశారు. కాని ఇప్పుడు మాత్రం ఆర్గనైజ్డ్ క్రయిమ్ సిండికేట్లు తెగ ఏర్పడి.. ప్రతీ దందాను కోట్ల రూపాయల బిజినెస్ గా మార్చేశాయి. అందుకే ఇప్పుడు డ్రగ్స్ స్మగుల్ చేసేవారు దొరికారు అనగానే.. అందులో సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనగానే.. అసలు ఈ మొత్తం బిజినెస్ టర్నోవర్ ఎంత ఉండొచ్చు అనే అనుమానం సహజంగా వస్తుంది.
మనోళ్ళు వాడుతున్నవి ఎల్.ఎస్.డి.. ఎక్సటసీ.. వంటి డ్రగ్స్ అని ఆల్రెడీ తెలుస్తోంది. వీటిని రోజూ తీసుకుంటే మాత్రం.. రోజుకు కనీసంగా 1000 నుండి 3 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాలి. పోనివ్ నెలలో సగం రోజులు ఈ డ్రగ్స్ చేసినా.. దాదాపు 30 వేలు ఖర్చవుతుంది. ఇలా టాలీవుడ్ మరియు ఇతరులను కలుపుకుంటే హైదరాబాద్ వంటి నగరంలో ఒక రెండు వేల మంది డ్రగ్ వాడకందార్లు ఉంటే.. నెలకు 6 కోట్లు టర్నోవర్ ఉన్నట్లే. అంటే సంవత్సరానికి దాదాపు 70+ కోట్ల బిజినెస్ అనమాట. ఒకవేళ అంచనాలకంటే ఈ వాడకందార్లు ఎక్కువగా ఉంటే మాత్రం.. ఎలా చూసుకున్నా కూడా ఒక 100 కోట్ల డ్రగ్స్ టర్నోవర్ కేవలం హైదారాబాద్ వంటి సిటీలో ఉందని చెప్పొచ్చేమో. పోనివ్ అందులో సగం ఉందని అనుకున్నా కూడా.. అది సొసైటీకి చాలా పెద్ద రిస్కే.
ఈ లెక్కన చూసుకుంటే.. డ్రగ్స్ వినియోగదార్లు.. అమ్మేవారు.. స్మగుల్ చేసేవారు.. చేతులు మార్చేవారు.. ఇలా ఎంతోమంది దీనిని ఒక ఆర్జనైజ్డ్ బిజినెస్ గా చేసి సొసైటీని బ్రష్టు పట్టిస్తున్నట్లే. అంతేకాదు.. వీరు తమ బిజినెస్ పెంచుకోవడానికి ఇప్పుడు స్టూడెంట్స్ ను ఇతరులను కూడా ఈ రొంపిలోకి లాగేస్తున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన సంగతిని కూడా చూస్తున్నాం. అందుకే వీటికి సంబంధం ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు దయచేసి సహకరించి ఈ వ్యవస్థను రూపుమాపడానికి సాయం చేయాలని ఎక్సయిజ్ శాఖ కోరుతోంది.