• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దృశ్యం-2'లో స్టార్ హీరో,...

'దృశ్యం-2'లో స్టార్ హీరో, హీరోయిన్..!

By - Tupaki Desk
Update: 2021-03-03 07:47 GMT
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రీమేక్ సినిమాలు చేసుకుంటూ సేఫ్ జోన్ లో ఉంటున్నాడు. ఆల్రెడీ వేరే భాషలో సూపర్ హిట్ సినిమాలను వెంకీ లైన్ లో పెడుతున్నాడు. ఈ విధంగా తెరకెక్కుతున్న సినిమానే నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న అసురన్ సినిమా రీమేక్ ఇది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమాను వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రెడీ అవుతోంది. అలాగే వెంకీ తాజాగా మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. ఇటీవలే పూజా కార్యక్రమం ముగించుకున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, సమంతలు కీలకపాత్రలలో కనిపించునున్నారని సమాచారం.

అయితే దృశ్యం-2 లో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కూడా వెంకటేష్ జోడిగా మీనానే నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం మొదటిపార్ట్ కూడా వెంకీనే రీమేక్ చేసాడు. ఇప్పుడు దృశ్యం-2 కూడా వెంకీనే చేస్తున్నాడు. అయితే మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధానపాత్రలలో నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో రీమేక్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ చేస్తున్న ఈ మూడు సినిమాలు ఇదే ఏడాది విడుదల చేయనున్నారు మేకర్స్. ఎందుకంటే ఆల్రెడీ నారప్ప సమ్మర్ లో రానుండగా.. ఎఫ్3 ఆగష్టులో రాబోతుంది. ఇక దృశ్యం-2 డిసెంబర్ నెలలో విడుదల చేస్తారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి వెంకీ సేఫ్ మూవీస్ తో హిట్స్ అందుకుంటాడేమో!
Tags:    
  • Jeethu Joseph 
  • Meena 
  • Drishyam2 
  • Mollywood 
  • Tollywood 
  • Rana Daggubatil 
  • Venkatesh 
  • Telugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS