ఈ వారం ఓటీటీ సినిమాల డామినేషన్‌

Update: 2021-09-17 07:30 GMT
గత వారం వినాయక చవితి సందర్బంగా థియేటర్ల ద్వారా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సీటీమార్ తో పాటు తలైవి సినిమాలు విడుదల అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టారు. ఓటీటీ లో టక్ జగదీష్‌ వచ్చినా జనాలు మాత్రం థియేటర్ల వైపు ఎక్కువగా వెళ్లారు అనేది టాక్. ఎందుకంటే సీటీమార్ కు మరియు తలైవికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇక తెలుగు ఆడియన్స్ ముందుకు ఈసారి ఓటీటీ సినిమాలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. నేడు ఓటీటీ లో ఏకంగా ఏడు సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాడు. డబ్బింగ్‌ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కలిపి పెద్ద ఎత్తున ఓటీటీ లో సందడి చేసేందుకు ఏడు సినిమాలు రెడీగా ఉన్నాయి.

ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా నితిన్ నటించిన 'మాస్ట్రో'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ మూవీ అందాదున్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. అంధాదున్ బాలీవుడ్‌ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా ఘన విజయంను సొంతం చేసుకుంటుందని మొదటి నుండి అందరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. దానికి తోడు ఈ సినిమాలో మొదటి సారి తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో పాటు అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనాలు నిలుపరాదును ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. నేటి నుండి స్ట్రీమింగ్‌ అవుతున్న ఇటచ వాహనాలు నిలుపరాదుకు పాజిటివ్‌ రెస్పాన్స్ సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది.

సునీల్ నటించిన కనబడుటలేదు సినిమా కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతుంది. స్పార్క్ ఓటీటీ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు సునీల్‌ నటించడం వల్ల ఈ సినిమాకు అన్ని విధాలుగా మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. ఎట్టకేలకు కనబడుటలేదు సినిమా స్ట్రీమింగ్‌ అవుతున్న నేపథ్యంలో సునీల్‌ అభిమానులు చూసేందుకు రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి ప్రథాన పాత్రలో తాప్సి నటించిన అన్నబెలే సేతుపతి సినిమా ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం చేశారు. ఈ సినిమా పై తమిళ మరియు తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. ఇంకా సోనీ లివ్ లో ప్రియురాలు.. నెట్‌ ఫ్లిక్స్ లో అంకహి కహనియ లు కూడా స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యాయి. ఇవి కాకుండి ఇతర భాషల సినిమాలు కూడా స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కనుక ఈ వీకెండ్‌ ఓటీటీ ప్రేక్షకుల పంట పండింది. థియేటర్‌ రిలీజ్ లు ఈసారి పెద్దగా లేని కారణంగా ఈ వారం డామినేషన్ ఓటీటీ రిలీజ్ లదే అంటూ టాక్ వినిపిస్తుంది.




Tags:    

Similar News