దోస్త్ మేరా దోస్త్! ఇండ‌స్ట్రీలో ఆలియా బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

Update: 2021-04-16 03:45 GMT
కరోనా మ‌హ‌మ్మారీ స్టార్ల‌ను వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ టాలీవుడ్ లో డ‌జ‌ను మంది పైగా ఇప్ప‌టికే కోవిడ్ కి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే కోలుకోగా మ‌రికొంద‌రికి చికిత్స కొన‌సాగుతోంది. ప‌లువురు స్టార్లు స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు.

ఇటీవ‌లే ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భ‌ట్ తాను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా మారాన‌ని సోష‌ల్ మీడియాల్లో వెల్లడించారు. ప‌రీక్ష‌ల్లో త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని చెబుతూ కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. దానికి అభిమానుల నుంచి స‌న్నిహితులు బంధుమిత్రులు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఆలియా కొలీగ్ ఇండ‌స్ట్రీ స్నేహితురాలైన సీనియ‌ర్ క‌థానాయిక కత్రిన ఈ వార్త విని చాలా సంతోషించారు. తన ట్విట్ట‌ర్ హ్యాండిల్ పై ఒక ఫోటోను షేర్ చేసి, ``నెగటివ్ గా ఉండటం మాత్రమే మంచి విషయం`` అని ఆలియా వ్యాఖ్యను జోడించగా త‌న‌ పోస్ట్ పై కత్రినా స్పందిస్తూ `అవును` అని రిప్ల‌య్ ఇచ్చారు. క‌త్రిన‌- ఆలియా బంధం గురించి ప్ర‌స్థావించాల్సి వ‌స్తే కాస్త వివ‌రంలోకి వెళ్లాలి. ఇండ‌స్ట్రీలో ఆలియాకు వెల్ విష‌ర్ క‌త్రిన‌. మంచి స్నేహితురాలు కూడా. ఆలియా న‌టించే సినిమాల‌న్నీ క‌త్రిన వీక్షించి రివ్యూలు చెబుతుంది. ప్ర‌శంస‌లు కురిపిస్తుంటుంది. ప్ర‌స్తుత బోయ్ ఫ్రెండ్ ర‌ణ‌బీర్ కి క‌త్రిన మాజీ ప్రేయ‌సి అన్న సంగ‌తి విధిత‌మే.

ఇటీవ‌లే క‌త్రిన‌కు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం దానికి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ వ‌చ్చాక‌ కత్రినా గత వారం రోజులుగా ఇంట్లోనే స్వీయ‌ నిర్బంధంలో ఉంది.  వైరస్ నుండి కోలుకుంటున్న వైనంపై ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానులకు తెలియజేసేందుకు క‌త్రిన వ‌రుస ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. ఇక ఆలియా తాను కోలుకున్నాను అని ప్ర‌క‌టించ‌గానే.. కత్రినా మాత్రమే కాదు.. ఆలియా తల్లి సోని రజ్దాన్- దియా మీర్జా- అనిల్ కపూర్ ..  ఇతర తారలు సంతోషం వ్య‌క్తం చేశారు.

త‌న‌కు కోవిడ్ సోక‌గానే కత్రిన గత వారం సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. త‌న‌ని క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. క‌త్రిన న‌టించిన‌ సూర్యవంశీ కోవిడ్ వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.
Full View
Tags:    

Similar News