ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా?

Update: 2023-02-10 12:50 GMT
టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం వీకెండ్ సందడి ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు అన్ని కూడా వీకెండ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిందే. దానికి కారణం వీకెండ్ లో సినిమా రిలీజ్ చేయడం ద్వారా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారని, అలాగే ఉద్యోగులకి కూడా వీకెండ్ సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలోనే వీకెండ్ అయ్యేసరికి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఏవో ఒకటి ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటాయి.

అందులో స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. అలాగే ఈ వీక్ లో కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వాటి రన్ టైం చూసుకుంటే కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాపై ఈ వారం ఎక్కువ బజ్ ఉంది.

ఈ మూవీ రన్ టైం 2 గంటల 19 నిమిషాలు ఉండటం విశేషం. అలాగే కన్నడ శివరాజ్ కుమార్ వేద మూవీ ఇప్పటికే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా ఉంది. అలాగే బాబీ సింహ నటించిన వసంత కోకిల సినిమా ఇంటరెస్టింగ్ మూవీగా రిలీజ్ అవుతుంది. దీని రన్ టైమ్1 గంట 47 నిమిషాల నిడివి మాత్రమే. తరువాత చూసుకుంటే అవికా గోర్ పాప్ కార్న్ కూడా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా2 గంటల 13 నిమిషాల నిడివి ఉంది. తరువాత చిన్న సినిమాలలో ఇట్స్ ప్యూర్ లవ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 13 నిమిషాలు.

చెడ్డీగ్యాంగ్ తమాషా అనే మూవీ కూడా వస్తుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. సిరిమల్లె పువ్వ అనే సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు. దేశం కోసం భగత్ సింగ్ అనే ఓ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు. ఇలా ఈ శుక్రవారం సిల్వర్ స్క్రీన్ పై కావాల్సినంత వినోదంగా ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News