వేటూరి డ్రైవర్ కార్లో నిద్ర పోతుంటే..
దిగ్గజ గేయ రచయిత వేటూరి పాటల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ జనాలు. శేఖర్ కమ్ముల తన తొలి సినిమా ఆనంద్ చేస్తున్నపుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే..అతడి తపన చూసి చాలా తక్కువ పారితోషకానికి పాటలు రాసి ఇచ్చిన మహానుభావుడాయన. ఇలా వేటూరి గొప్పదనాన్ని చాటే ఉదంతాలు మరెన్నో ఉన్నాయి. తాజాగా సీనియర్ డైలాగ్ రైటర్ దివాకరబాబు.. వేటూరి వర్ధంతిని పురస్కరించుకుని తాజాగా ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటే ఒక ఉదాహరణను ఫేస్‌బుక్ లో పంచుకున్నారు. అందులో ఆయనేమన్నారంటే..
"మద్రాసు ఏవీఎం స్టూడియోలో నేను సంభాషణలు రాసిన ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా వేటూరి గారు గబగబా నడుచుకుంటూ వచ్చారు. నేను సిగరెట్ పారేసి నమస్కరించాను. ప్రతి నమస్కారం చేసి బావున్నారా అని అడిగారు. అంతలో ఒక బాయ్ ఆటో తీసుకువచ్చాడు. వేటూరి గారు ఆటో ఎక్కుతుంటె "అదేంటి సార్ ఆటోలో ఏంటి మీ కారు వుంది కదా" అన్నాను. "ఉందండీ.. సాంగ్ రికార్డింగ్ అయిపోయాక వచ్చి చూస్తే డ్రైవర్ గాఢంగా నిద్రపోతున్నాడు. పాపం నిద్ర లేపడం ఎందుకని ఆటోలో వెళ్తున్నా" అని పసిపాపడంత హాయిగా నవ్వేసి ఆటోలో వెళిపోయారు.
అదే ఇంకొకరయితే డ్రైవర్ని నిద్రలేపుతారు. లేదా నిద్రపోయినందుకు కోపం వచ్చి ఉద్యోగం పీకేసేవారు. కానీ ఆ మహాకవి వేటూరి గారు డ్రైవర్ని నిద్రలేపడం ఇష్టం లేక ఆటోలో వెళ్ళారు. నా కళ్ళు చమర్చాయి. ఎంత సున్నిత హృదయం ఆయనది! అందుకేనేమో అన్ని వేల పాటలతో తెలుగు వారి గుండెల్ని తడిపేశారు. ఆ మహానుభావుడి వర్ధంతి ఈ రోజు. ఎందుకో ఈ సంఘటన గుర్తొచ్చింది" అని ముగించారు దివాకరబాబు.