#స‌లార్.. ప్ర‌భాస్ స‌ర‌స‌న 6 ప్యాక్ బ్యూటీనా?

Update: 2020-12-23 04:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్ర‌క‌టించి సెన్సేష‌న్ కి తెర తీసారు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి మొద‌లైంది. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కావాల్సి ఉంది. ఈలోగానే స‌లార్ కి సంబంధించిన ప‌నుల్ని ప్ర‌శాంత్ నీల్ శ‌ర‌వేగంగా కానిచ్చేస్తున్నారు. కేజీఎఫ్ 2 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటు ప్ర‌భాస్ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. సాలార్ చిత్రీకరణను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. ప్రొడక్షన్ వేగంగా పూర్తి చేసి ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని కేజీఎఫ్ దర్శకుడిని ప్ర‌భాస్ కోరార‌ట‌. తక్కువ సమయంలో పూర్తి చేస్తానని అత‌డు హామీ ఇచ్చిన తరువాత మాత్రమే ప్రభాస్ తన కాల్షీట్ల‌ను స‌ర్ధుబాటు చేశార‌ని తెలుస్తోంది.

ఆ క్ర‌మంలోనే ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న నాయిక‌ల్ని ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్. ప్ర‌భాస్ నాయిక‌ల్లో ఒక‌రిగా దిశా ప‌టానీని ఖాయం చేసే వీలుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్ `లోఫర్`తో దిశా ప‌టానీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ తొలి ప్ర‌య‌త్నం ఫెయిలైంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో విజ‌యాలు అందుకుని వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యింది. చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స‌ర‌స‌న దిశా ఆఫ‌ర్ అందుకోనుంది గ‌నుక ఇది ఘ‌న‌మైన రీఎంట్రీ అవుతుంద‌నే భావించాలి.

ఇక దిశా ప‌టానీకి ఇన్ స్టా వేదిక‌గా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం జిమ్ యోగా సెష‌న్స్ వీడియోల్ని ఫోటోల్ని షేర్ చేస్తూ మార్ష‌ల్ ఆర్ట్స్ క్వీన్ గానూ పంచ్ లు విసురుతూ ఈ అమ్మ‌డు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రెగ్యుల‌ర్ జిమ్ తో ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేస్తున్న ఈ బ్యూటీ 6 ప్యాక్ రేంజును ఎలివేట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.
Tags:    

Similar News