పటానీని పటాయించడం కష్టమే

Update: 2015-11-10 11:30 GMT
టాలీవుడ్ డైరెక్టర్లలో ఒక్కోరిదీ ఒక్కో స్పెషాలిటీ. మాస్ మూవీస్ విషయంలో పూరి జగన్నాధ్ కి ఓ ప్రత్యేకమైన మార్క్ ఉండడమే కాదు.. ఈయన తెచ్చే భామలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. పూరీ మూవీలో హీరోయిన్ కానీ, ఐటెం గాళ్ గా గానీ బుక్ అయితే.. ఆ భామ వంక టాలీవుడ్ ఆసక్తికరంగా చూస్తుంది. ఆఫర్స్ కూడా బాగానే క్యూ కడుతుంటాయి. ఒకటీఅరా సందర్భాల్లో మినహాయించి.. చాలాసార్లు ఇదే జరిగింది. కానీ వరుణ్ తేజ్ లోఫర్  హీరోయిన్ దిశా పటానీ లెక్క వేరేగా ఉంది.

అలాగని ఈమెకు ఆఫర్స్ రావడం లేదనుకుంటే పొరపాటే. ఇంకా లోఫర్ రిలీజ్ కాక ముందే.. అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ భామను హీరోయిన్ గా బుక్ చేసుకునేందుకు టాలీవుడ్ బాగానే ప్రయత్నిస్తోంది. అయితే.. వచ్చే నెల 18న లోఫర్ రిలీజ్ కానున్నా, ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినా.. దిశా పటానీ మాత్రం కొత్త మూవీ ఏదీ యాక్సెప్ట్ చేయలేదు. ఇకపై తెలుగు సినిమాల్లో నటించకూడదని ఈమె నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ ని చెప్పడంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి రావడం, ఎక్కువ టేక్స్ అవసరం అవుతుండడం, డైలాగ్స్ అర్ధంకాక ఎక్స్ ప్రెషన్స్ సరిగా ఇవ్వలేకపోవడంతో.. ఇకపై సౌత్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటోందట దిశా పటానీ.
Read more!

బాలీవుడ్ లో పాదం మోపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అదే సమయంలో భారీ రెమ్యూనరేషన్ ఇస్తామంటూ నిర్మాతలు వెంటబడుతున్నా.. ససేమిరా అంటోందట. మన సినిమాల్లో నటించను అంటుందా అని కస్సుబుస్సుమనచ్చు కానీ.. భారీగా ముట్టచెబుతామన్నా సరే లాంగ్వేజ్ ప్రాబ్లెంతో నిరాకరిస్తున్న విషయాన్ని ప్రశంసించాల్సిందే. ఎందుకంటే.. ఇలాంటి ఆఫర్స్ వచ్చిన వాళ్లు.. బ్యాంక్ అకౌంట్లు నిండితే చాలు అనుకునే బాపతుగానే ఉంటున్నారు. కానీ నా రూటే సెపరేటు అంటున్న దిశా పటానీని మాత్రం ఎవరూ పటాయించలేకపోతున్నారు.

Tags:    

Similar News