నడుం తిప్పడంలో లోఫర్ బేబీ కేక

Update: 2015-12-07 15:37 GMT
పూరీ జగన్నాధ్ సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి పూరీ తీస్తున్న లోఫర్ లో దిశా పటానీ అనే కొత్త హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ అమ్మడు బయట పెద్దగా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయించారని చెప్పచ్చు.

ఇలా ఎందుకు చేశారనే విషయం ఆడియో ఫంక్షన్ లో అర్ధమయిపోయింది. నిజానికి ఇంపోర్ట్ చేసుకున్న భామలను.. ఫంక్షన్లకి పిలిస్తే.. ఒకటి అరా తెలుగు ముక్కలతో పొడిపొడి మాటలతో సరిపెట్టేస్తారు. కానీ దిశా పటానీ మాత్రం.. ఏకంగా స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేయడం విశేషం. ఒకవైపు హీరో వరుణ్ తేజ్ తనతో చేయకపోయినా.. కేవలం డ్యాన్సర్లతోనే లోఫర్ మూవీలోని మాస్ పాటకు చిందేసింది దిశా.

చుట్టా బీడీ నోట్లో పెట్టు.. జర్దా బీడీ బిగించి కొట్టు.. అనే ఫుల్ మాస్ సాంగ్ కి.. దిశా పటానీ వేసిన స్టెప్స్ చూస్తే ఎవరైనా సరే.. ఔరా అనాల్సిందే. ఫస్ట్ సినిమానే అయినా.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ రేంజ్ లో స్టెప్పులు ఇరగదీసేయడం సూపర్బ్ అనాలి. ముఖ్యం నడుం తిప్పడంలో అయితే.. ముమైత్ ఖాన్ మరిపించేసిందనే టాక్ వినిపించింది. లుక్ విషయంలో కూడా అమ్మడు అదిరిపోవడం, మరోవైపు డ్రెసింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం చూస్తుంటే.. టాలీవుడ్ కి మరో సూపర్బ్ హీరోయిన్ వచ్చేసినట్లే అనిపిస్తోంది.
Tags:    

Similar News