సుకుమార్ మధ్య రకం సినిమాలు తీస్తేనా..

Update: 2018-04-03 23:30 GMT
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటిదాకా చెత్త సినిమా అంటూ ఏదీ తీయలేదు. ఆయన కెరీర్లో డిజాస్టర్లుగా నిలిచిన ‘జగడం’.. ‘1 నేనొక్కడినే’ కూడా క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్నాయి. ఐతే ఆ సినిమాల విషయంలో కానీ.. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల విషయంలో కానీ.. ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే.. సుకుమార్ ప్రేక్షకుల్ని మరీ కన్ఫ్యూజ్ చేస్తాడని. ఈ లెక్కల మాస్టారి తెలివితేటల్ని జనాలు అర్థం చేసుకోలేరని.. స్క్రీన్ ప్లేలో గజిబిజి ఎక్కువ కావడం వల్ల ఆయన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోవట్లేదని మొన్నటిదాకా అనే వాళ్లు. ఐతే ఇప్పుడు సుకుమార్ ‘రంగస్థలం’తో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇందులో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. స్ట్రెయిట్ నరేషన్ తో సినిమా తీసి మెప్పించాడు సుకుమార్.

‘రంగస్థలం’ పాజిటివ్ టాక్ తో మొదలై.. మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. సుకుమార్ ముద్ర ఇందులో మిస్సయిందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఇది సుకుమార్ సినిమాలా లేదనే వాళ్లూ ఉన్నారు. సుకుమార్ మార్కు ఇంటలిజెన్స్.. బ్రిలియన్స్ ఇందులో మిస్సయిందని.. కన్ఫ్యూజన్ వద్దంటే మరీ ఇంత ఫ్లాట్ గా సినిమాను నడిపించాలా అని అంటున్నారు ఓ వర్గం ప్రేక్షకులు. 80వ దశకం నేపథ్యంలో సినిమా సాగడం.. నటీనటుల అభినయం చాలా బాగుండటం.. సాంకేతిక ఆకర్షణలు కూడా తోడవడంతో సినిమా బాగానే ఆడుతుండొచ్చు కానీ.. సుకుమార్ ముద్ర ఇందులో పూర్తి స్థాయిలో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే అని ఆయన వీరాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐతే ‘1 నేనొక్కడినే’.. ‘నాన్నకు ప్రేమతో’ తరహాలో మరీ ఇంటిలిజెంట్ గా కాకుండా.. ‘రంగస్థలం’ లాగా మరీ స్ట్రెయిట్ నరేషన్ తో కాకుండా.. మధ్యస్థంగా ఉండే సినిమా తీస్తే అందరికీ నచ్చుతుందని.. అప్పుడు దాని రీచ్.. రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. మరి సుక్కు తన తర్వాతి సినిమాలో ఆ తరహా ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News