జ‌క్క‌న్న హ్యాండిచ్చాడు.. క‌నీసం వాళ్ల‌యినా?

Update: 2020-05-19 03:30 GMT
ఎన్టీఆర్ అభిమానులిప్పుడు మామూలు షాక్‌ లో లేరు. తార‌క్ పుట్టిన రోజుకు ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఏదో ఒక కానుక త‌ప్ప‌క ఉంటుంద‌ని నిన్న‌టిదాకా ఆశ‌తో ఉన్నారు. కానీ ఆ ఆశ‌ల‌పై చిత్ర బృందం నీళ్లు చ‌ల్లేసింది. చ‌ర‌ణ్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన‌ట్లే.. తార‌క్ బ‌ర్త్ డేకి కూడా టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని అనుకున్నా.. లాక్ డౌన్ కార‌ణంగా పేప‌ర్ మీద ఉన్న కంటెంట్‌ను కెమెరాలోకి తీసుకెళ్లే అవ‌కాశం లేక‌పోయింది. టీజ‌ర్ విష‌యంలో ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదంటూ రాజ‌మౌళి నెల కింద‌టే ఉన్న ఇబ్బందిని బ‌య‌ట‌పెట్టేశాడు. కాక‌పోతే ఏదో ఒక మ్యాజిక్ చేసి టీజ‌ర్ రెడీ చేస్తాడ‌ని అనుకున్నారు. అది కుద‌ర‌ని ప‌క్షంలో క‌నీసం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌రైనా రిలీజ్ చేస్తార‌ని ఆశించారు. కానీ అది కూడా లేకుండా చేతులెత్తేసింది ఆర్ఆర్ఆర్ టీం.

టీజ‌ర్ కోస‌మైతే విజువ‌ల్స్ తీసుకోవాలి. ఇంకా చాలా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. పోస్ట‌ర్ కోస‌మైతే అంత క‌ష్టం అవ‌స‌రం లేదు. షూట్ చేసిన విజువ‌ల్స్ నుంచి ఏదో ఒక స్టిల్ తీసుకుంటే స‌రిపోయేది. మంచిది ఎంచుకోవ‌డం, దానికి మెరుగులు దిద్ది ఫ‌స్ట్ లుక్ త‌యారు చేయ‌డం పెద్ద క‌ష్టం కాదు. అదైనా రిలీజ్ చేస్తే అభిమానులు సంతృప్తి ప‌డేవాళ్లు. కానీ జ‌క్క‌న్న ఏమ‌నుకున్నాడో ఏమో.. అదీ లేకుండా అభిమానుల్ని నైరాశ్యంలో ముంచెత్తాడు. తార‌క్ పుట్టిన రోజు కోసం మునుపెన్న‌డూ లేని స్థాయిలో అభిమానులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ నెల ఆరంభంలో స్పెష‌ల్ బ‌ర్త్ డే సీడీపీ త‌యారు చేయించారు.

తాజాగా నాలుగు భాష‌ల్లో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లతో పోస్ట‌ర్లు డిజైన్ చేయించారు. బ‌ర్త్ డే ట్రెండ్ కోసం ఓ రేంజిలో రెడీ అవుతున్నారు. ఐతే ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఏ విశేషం లేద‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చేస‌రికి అంద‌రూ నీరుగారిపోయారు. క‌నీసం త్రివిక్ర‌మ్, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో అనుకుంటున్న సినిమాల‌కు సంబంధించి అయినా తార‌క్ ఏమైనా అప్ డేట్లు ఇస్తాడేమో అని వాళ్లు ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News