థియేటర్స్ లో సందడి చేయనున్న 'డర్టీ హరి'

Update: 2021-01-01 05:54 GMT
టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన సీనియర్‌ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు దర్శకుడిగా మారి 'వాన' 'తూనీగ తూనీగ' వంటి చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టి 'డ‌ర్టీ హరి' అనే సినిమా రూపొందించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇటీవల డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా రిలీజ్ అయింది. 'ఫ్రైడే మూవీస్' అనే కొత్త ఏటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి రివ్యూస్ రాబట్టింది. పలువురు సినీ ప్రముఖులు కూడా 'డర్టీ హరి' చిత్రాన్ని ఎమ్. ఎస్. రాజు దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా తెలుగు ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' యాప్ లో కూడా స్ట్రీమింగ్ కి పెట్టారు. అయితే ఇప్పుడు 'డర్టీ హరి' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో సంక్రాంతి సీజన్ లో 'డర్టీ హరి' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో యూత్ ని ఆకట్టుకునే సన్నివేశాలు.. థ్రిల్లింగ్ అంశాలు ఉండటంతో ఈ సీజన్ కి రావడం కరెక్ట్ అని భావించి జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నిజానికి పెద్ద సినిమాలు అన్నీ జనవరి 13 తర్వాత రిలీజ్ అవుతున్నాయి. 'డర్టీ హరి' సినిమా ఈ గ్యాప్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. శ్రవణ్‌ రెడ్డి - రుహానీ శర్మ - సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు - సాయి పునీత్ నిర్మించారు. దీనికి మార్క్.కె.రాబిన్ సంగీతం అందించగా.. ఎం.ఎన్.బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ వర్క్ చేశారు.
Tags:    

Similar News