ఫ్లాప్ అంటే మెయిన్ టార్గెట్ డైరెక్ట‌రే

Update: 2022-05-04 13:30 GMT
ఇండ‌స్ట్రీలో ఏం మాట్లాడినా స‌క్సెసే మాట్లాడాలి. స‌క్సెసే స‌మాధానం చెప్పాలి. ఒక్క హిట్టు ప‌డిందా జాత‌కాలు మారిపోతుంటాయిక్క‌డ‌. స్టార్ డైరెక్ట‌ర్ అయినా స‌రే ఒక్క ఫ్లాప్ ప‌డిందా? మ‌ళ్లీ వెన‌క్కి తోసేస్తారు. నెట్టింట ట్రోలింగ్ చేసేస్తారు. న‌చ్చితే నెత్తిన పెట్టుకోవ‌డం.. న‌చ్చ‌క‌పోతే విమ‌ర్శించ‌డం ఇప్ప‌డున్న నయా ట్రెండ్. ఇండ‌స్ట్రీ హిట్ లు ఇచ్చినా.. బాక్సాఫీస్ ని షేక్ చేసినా.. క్రేజీ హీరోతో సినిమా చేసినా ఒక్క ఫ్లాప్ ప‌డిందో విమ‌ర్శ‌లు షురూ అవుతుంటాయి. స‌క్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ట్రోల్ చేస్తుంటారు. ఇలా ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ కు గురైన డైరెక్ట‌ర్ ల గురించి ఇప్ప‌డు చూద్దాం.

ఈ వ‌రుస‌లో ముందున్న ద‌ర్శ‌కుడు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. 2013లో `మిర్చి` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ట‌ర్న్ అయ్యారు. ప్ర‌భాస్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ద‌ర్శ‌కుడిగా కొర‌టాల శివ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించి ఆయ‌న‌ని స్టార్ డైరెక్ట‌ర్ ని చేసింది. ఆ త‌రువాత చేసిన శ్రీ‌మంతుడు, జన‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి. `రెబెల్` తో ఫ్లాప్ లో వున్న ప్ర‌భాస్ కెరీర్ ని `మిర్చీ` బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఘాటెక్కించారు. ఇక‌ వ‌న్ నేనొక్క‌డినే, ఆగ‌డు వంటి వ‌రుస డిజాస్ట‌ర్ ల‌తో వున్న మ‌హేష్ కెరీర్ కి `శ్రీ‌మంతుడు`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించి కొత్త ఉత్సాహాన్నిచ్చారు.

ఇక ఇదే హీరోకు బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ లు భారీ షాకులిచ్చాయి. ఈ షాక్ నుంచి మ‌హేష్ ని `భ‌ర‌త్ అనే నేను` బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న కొర‌టాలకు ఇటీవ‌ల చేసిన `ఆచార్య‌` భారీ షాక్ నిచ్చింది. దీంతో కొర‌టాల‌ని టార్గెట్ చేస్తూ చాలా వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ లు ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇంత ఫేల‌వంగా తీస్తారా? క‌థే లేకుండా పాత్ర‌ల‌తో సినిమా ఎలా తీశారంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. తెర వెనుక ఏం జ‌రిగిందో.. ఎవ‌రు చేతులు పెట్టారో తెలియ‌కుండా కొర‌టాల ని టార్గెట్ చేయ‌డం విచార‌క‌రం అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

ఇదే పంథాలో అప‌జ‌య‌మెరుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ట్రోలింగ్ కు గుర‌య్యారు. ఆయ‌న తెర‌కెక్కించిన `ట్రిపుల్ ఆర్‌` ఇటీవ‌ల విడుద‌లై పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన సినిమా ఇది. ఇద్ద‌రు లెజండ‌రీ ఫ్రీడ‌మ్ పైట‌ర్ ల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లు. కానీ ఆ స్థాయికి చేర‌లేక‌పోయింది. 1100 కోట్ల మాత్ర‌మే దాటి అంటితో స‌రిపెట్టుకుంది.

దీంతో రాజ‌మౌళిని ఇంత వ‌ర‌కు పొడిగిన వాళ్లే టార్గెట్ మిస్ ఫైర్ కావ‌డంతో విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. ఇద్ద‌రు హీరోల‌ని స‌మానంగా చూపించ‌లేక‌పోయార‌ని, అనుకున్న ప్థాయిలో ఇంపాక్ట్ ని క‌లిగించ‌లేక‌పోయారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స్టార్ డైరెక్ట‌ర్ల త‌ర‌హాలోనే యంగ్ డైరెక్ట‌ర్లు కూడా ట్రోలింగ్ కి గుర‌య్యారు. `రాధేశ్యామ్` డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్ సినిమా రిలీజ్ కు ముందు నుంచే నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యారు. రిలీజ్ త‌రువాత విమ‌ర్శ‌ల పాల‌య్యారు. `ట‌క్ జ‌గ‌దీష్` విష‌యంలో శివ నిర్వాణ విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

 `మ‌హా స‌ముద్రం` ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌క‌పోవ‌డంతో అజ‌య్ భూప‌తి ట్రోలింగ్ కి గుర‌య్యారు. `మంచి రోజులొచ్చాయి` తో మారుతిని అడ్డంగా బుక్ చేశారు. డియ‌ర్ కామ్రేడ్ తో భ‌ర‌త్ క‌మ్మ‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌గా కిర‌ణ్ కొర్ర‌పాటి తొలి చిత్రం `గ‌ని`తో విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. సినిమా కు ఏది త‌క్కువైనా టార్గెట్ డైరెక్ట‌ర్ అవుతున్నాడు.
Tags:    

Similar News