• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజశేఖర్ కూతురిని లాంఛ్...

రాజశేఖర్ కూతురిని లాంఛ్ చేసేదెవరంటే..

By - Tupaki Desk
Update: 2017-03-09 05:11 GMT
రాజశేఖర్-జీవితల పెద్ద కూతురు శివాని సినీ అరంగేట్రంపై కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఇప్పటికే చెప్పేశారు. ఇప్పటికే ఓ కుర్ర హీరోతో మూవీకి సైన్ చేసిందని కూడా అన్నారు కానీ.. జీవిత మాత్రం వీటిని ఖండించింది. తామింకా స్క్రిప్ట్స్ వినే స్టేజ్ లోనే ఉన్నామని.. ఏదీ ఫైనల్ కాలేదని చెప్పేసిందామె.

ఇప్పుడు శివానిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోయే డైరెక్టర్ అంటూ.. ఓ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన వేరెవరో కాదు.. దర్శకుడు తేజ. ప్రస్తుతం రానా దగ్గుబాటి.. కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని తీస్తున్న తేజ.. ఆ వెంటనే శివానిని పరిచయం చేసే ప్రాజెక్టును ప్రారంభిస్తాడని అంటున్నారు. గతంలో రాజశేఖర్-తేజల కాంబినేషన్ లో 'అహం'అనే ప్రాజెక్టు తెరకెక్కుతుందని అన్నారు. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు కానీ.. కూతురుతో సినిమా చేసేందుకు దర్శకుడు ఓకే చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం.

జీవిత.. తేజ.. వీరిద్దరు క్లాస్ మేట్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అందుకే ఈ దర్శకుడి చేతిలో తమ కూతురు భవిష్యత్ పెట్టేందుకు సిద్ధమయ్యారట రాజశేఖర్ దంపతులు. తమ డాటర్ ను సాఫ్ట్ లాంఛ్ చేయడానికి తేజ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Director Teja 
  • Rajasekhar Daughter 
  • Sivani 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS