'పవర్‌ స్టార్‌' రిలీజ్‌ డేట్‌ తో పవన్‌ ఫ్యాన్స్‌ టెన్షన్‌!!

Update: 2020-07-16 07:30 GMT
వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘పవర్‌ స్టార్‌’. ఈ చిత్రం ఎలా ఉంటుంది ఎలా తీస్తున్నాడు అనే విషయాన్ని వర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామిపై ఒట్టు వేసి చెబుతున్న ఇందులో ఎవరిని విమర్శించడం లేదు.. ఎవరిని తప్పుగా చూపించడం లేదు అంటూ చెప్పాడు. ఆయన మాటలోనే ఏ స్థాయిలో సినిమాను కాంట్రవర్సీగా రూపొందిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో పవన్‌ కళ్యాణ్‌.. చిరంజీవి.. నాగబాబుతో పాటు చంద్రబాబు నాయుడును కూడా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ తో క్లారిటీ వచ్చింది.

వర్మ ఈమద్య కాలంలో సినిమాలను వారాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నాడు. వారం పది రోజుల క్రితమే పవర్‌ స్టార్‌ చిత్రాన్ని ప్రారంభించిన వర్మ మరికొన్ని రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేసే అవకాశం ఉంది. వర్మ తల్చుకుంటే ఈ నెల చివరి వరకు లేదా ఆగస్టు మొదటి వారంలోనే విడుదల చేయగలడు. కాని వర్మ ఈమద్య కంటెంట్‌ కంటే కూడా అధికంగా పబ్లిసిటీపై ఫోకస్‌ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాను వర్మ పవన్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేస్తే ఫుల్‌ పబ్లిసిటీ దక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నాడట.

సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే న ఫ్యాన్స్‌ భారీ ఎత్తున వేడుక చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ లో రికార్డు సృష్టించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా కేక్‌ కట్టింగ్స్‌ చేయనున్నారు. పవన్‌ బర్త్‌ డేకు ఇప్పటి నుండే రెడీ అవుతున్న ఫ్యాన్స్‌ కు వర్మ ‘పవర్‌ స్టార్‌’ మూవీ విడుదల తేదీ కంగారు పెడుతోంది.

పవన్‌ బర్త్‌ డే రోజున ఆ సినిమాను వర్మ విడుదల చేస్తే అంతా గందరగోళంగా మారే అవకాశం ఉంది. ఫ్యాన్స్‌ ఫోకస్‌ మారుతుందని వర్మపై విమర్శలకు దిగుతారు. ఖచ్చితంగా వర్మ తన సినిమాలో పవన్‌ గురించి సెటైర్స్‌ వేయడం చేస్తాడు. తద్వారా ఫ్యాన్స్‌ నిరుత్సాహపడటం ఖాయం. తద్వారా బర్త్‌ డే వేడుకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే పవర్‌ స్టార్‌ మూవీ విడుదల తేదీ ఫ్యాన్స్‌ కు టెన్షన్‌ పెడుతోందట.
Tags:    

Similar News